ఫిబ్రవరి నెలంతా శుభ గ్రహంగా రాహువు. శుభ రాహువుతో ఈ రాశులవాళ్ళకు వద్దంటే డబ్బు!
ఫిబ్రవరి నెలంతా రాహువు శుభ గ్రహంగా మారడం జరుగుతోంది. ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్న ఈ పాపగ్రహం ఫిబ్రవరి 4 నుంచి బుధుడితోనూ, 6 నుంచి శుక్రుడితోనూ యుతి చెందుతుంది. అంతేకాక, గురు దృష్టి కూడా ఈ రాహువు మీద పడడం వల్ల ఈ గ్రహం కొన్ని రాశులకు శుభ యోగాలను కలిగించడం జరుగుతుంది.
నెల రోజులకు పైగా మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి అనేక విధాలైన శుభాలను అనుగ్రహిం చడం జరుగుతుంది. ఈ రాశులవారు అనుకున్నవన్నీ, ఆశించినవన్నీ జరిగే అవకాశం ఉంది.
మేషం ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న రాహువు శుభుడుగా మారడం వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మంచి పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. విదేశీ ఆఫర్లు అందే అవకాశం కూడా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరగడం, వ్యాపారాలు బిజీగా సాగిపోవడం, విదేశాలకు వెళ్లడం వంటివి జరిగే అవకాశం ఉంది.
వృషభం ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న రాహువుతో బుధ, శుక్రులు యుతి చెందడం, గురువు వీక్షిం చడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ కావడం, పేరు ప్రఖ్యాతులు పెరగడం, విదేశీయానానికి ఆటంకాలు తొలగడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. అధికారుల ఆదరాభిమానాలు పెరుగుతాయి. కొందరు రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.
సింహం ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు గురు, బుధ, శుక్రుల ప్రభావం వల్ల శుభుడుగా మారడం సిరిసంపదలు బాగా వృద్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కుదరడం వంటివి తప్పకుండా జరుగుతాయి. శుభ యోగాలు కలగడానికి, రాజయోగాలు, ధన యోగాలు పట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది.
తుల ఈ రాశికి పంచమ స్థానంలో మూడు శుభగ్రహాల ప్రభావం రాహువు మీద పడడం వల్ల రాజపూజ్యాలు పెరుగుతాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆస్తి, వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.
ధనుస్సు ఈ రాశికి తృతీయ స్థానంలో ఉన్న రాహువులో బుధ, శుక్రులు కలవడం, గురువు వీక్షించడం వల్ల సుఖ సంతోషాలకు, మనశ్శాంతికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వ్యక్తి గత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అయి, జీవితం బాగా సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
మకరం ఈ రాశికి ధన స్థానంలో ఉన్న రాహువుతో గురు, శుక్ర, బుధులకు సంబంధం ఏర్పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభ వార్తలు ఎక్కువగా వింటారు. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా పరిష్కారమయి, అన్యోన్యత పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
.jpeg)
0 Comments