తెల్లగా మారిన జుట్టుకు...
చాలామందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడి పోతుంది. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా కూడా ఇలా జరుగొచ్చు. సహజ పద్ధతుల్లో చేస్తే తెల్ల జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతుంది.
• ఉసిరిపొడి చేసుకోండి. అందులో నిమ్మరసం కలిపి పేస్ట్ మాదిరిగా చేసుకోండి. దాన్ని రోజూ తలకు పూసుకొని రెండు గంటలాగి తలస్నానం చేయండి. ఇలా రెగ్యులర్గా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
• ఉల్లిగడ్డను మెత్తగా మిక్సీ చేయాలి. ఈ పేస్టు తెల్ల వెంట్రుకలు ఉన్న చోట రాయండి. రెండు గంటలు ఆగి తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరుచుగా చేయాల్సి ఉంటుంది.
• కొబ్బరినూనెలో నిమ్మరసం కలుపాలి. రోజూ ఈ రసం తలకు పూసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. అలాగే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.
• నువ్వులను మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఇందులో బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని తరుచుగా తలకు రాస్తుండాలి.
• రోజూ క్యారెట్ జ్యూస్ తాగితే కూడా జుట్టు నల్లబడుతుంది. ఫుడ్లో ప్రొటీన్స్, విటమిన్ బి12 ఎక్కువగా ఉండాలి.
.jpeg)
0 Comments