ఓపెన్ స్కూల్ దరఖాస్తుకు 25 వరకు గడువు
✳️ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీ ఓఎస్ఎస్) ద్వారా 2021-22 విద్యాసంవత్సరానికి దూర విద్య 10వ తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో ప్రవేశానికి తుది గడువు ఈనెల 25
✳️టెన్త్ లో చేరేందుకు 14 ఏళ్ల వయస్సు, ఇంటర్ లో ప్రవేశానికి టెన్త్ పూర్తి చేసి 15 ఏళ్ల వయసు నిండి ఉండాలి.
✳️ అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని, అక్టోబర్ 27వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా అడ్మిషన్ ఫీజు చెల్లించాలి
✳️అలాగే రూ.200 అపరాధ రుసుంతో దరఖాస్తు చేసేందుకు నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉంది
✳️వివరాలకు డీఈవో కార్యాలయంతోపాటు apopenschool.gov.in వెబ్ సైట్ ను సందర్శించవచ్చు
0 Comments