GET MORE DETAILS

ఖాళీ స్థానాల్లో మళ్లీ ఎన్నికలకు సన్నాహాలు - ఆర్వోల నియామకాలకు పుర, నగరపాలక సంస్థల ప్రతిపాదనలు

 

ఖాళీ స్థానాల్లో మళ్లీ ఎన్నికలకు సన్నాహాలు - ఆర్వోల నియామకాలకు పుర, నగరపాలక సంస్థల ప్రతిపాదనలు




రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానాల్లో తిరిగి ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. అన్ని చోట్ల నుంచి ఖాళీల వివరాలు సేకరించి వీటిలో ఎన్నికల అధికారుల(ఆర్వో)ను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి 10న నిర్వహించిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల తరువాత పలు కారణాలతో నగరపాలక సంస్థల్లో 12 మంది కార్పొరేటర్లు మృతి చెందారు. వీరిలో కాకినాడ నగరపాలక సంస్థలో నలుగురు, విశాఖ, ఏలూరులో చెరో ఇద్దరు, విజయనగరం, మచిలీపట్నం, గుంటూరు, అనంతపురంలో ఒకరు చొప్పున మరణించారు. పురపాలక సంఘాల్లో 14 మంది కౌన్సిలర్లు మృతి చెందారు.


ఈ స్థానాలకు ఇప్పటికే ఓటర్ల జాబితాలు ప్రచురించారు. పోలింగ్‌ కేంద్రాలు, ఇతరత్రా ఏర్పాట్ల కోసం ఆర్వోల పేర్లను సూచిస్తూ కమిషనర్లు ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. వీరి నియామక ప్రక్రియ పూర్తయి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు పుర, నగరపాలక సంస్థలు నివేదించాక ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇస్తుంది. సాధ్యమైనంత వేగంగా ఎన్నికలు నిర్వహించే యోచనతో ఎన్నికల సంఘం ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments