GET MORE DETAILS

చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు అంత ఎత్తు ఎలా ఎగరగలుగుతారు?

 చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు అంత ఎత్తు ఎలా ఎగరగలుగుతారు?




కొంత ఎత్తు నుంచి ఒక వస్తువును వదిలితే అది భూమిపై పడడానికి కారణం భూమికి ఉండే ఆకర్షణ ప్రభావమే. దీనినే 'భూమ్యాకర్షణ శక్తి' లేక 'గురుత్వాకర్షణ' అంటారు. ఈ గురుత్వాకర్షణ వల్లే ఏ వస్తువుకైనా 'బరువు' అనే ధర్మం ఏర్పడుతుంది.

3475 కిలోమీటర్ల వ్యాసం ఉండే చంద్రుడు భూమి పరిమాణంలో నాలుగవ వంతు. ద్రవ్యరాశి విషయానికి వస్తే భూమి ద్రవ్యరాశి చంద్రుని కన్నా 81 రెట్లు ఎక్కువ. ఈ కారణాల వల్ల చంద్రునికి ఉండే గురుత్వాకర్షణ భూమికి ఉండే గురుత్వాకర్షణ కన్నా చాలా తక్కువ. ఈ కారణంగా ఏ వస్తువైనా, మనలాంటి ప్రాణులైనా భూమిపై బరువు కంటే చంద్రునిపై 1/6 వ వంతు మాత్రమే తూగుతారు. అందువల్లే వ్యోమగాములు అంత బరువైన 'అంతరిక్ష సూట్‌'లు ధరించినా చంద్రునిపై సునాయాసంగా తిరుగగలుగుతారు. అంతగా బరువు తగ్గడంతో వారికి చంద్రుని నేలపై సరిగా పట్టు ఉండక వారి పాదాలు జారిపోతున్నట్లు, కొంచెంగా గాలిలో తేలిపోతున్నట్లు ఉంటుంది. అక్కడ తిరుగాడే వాహనాల చక్రాలు కూడా సరైన పట్టు దొరకక జారిపోయే ప్రమాదం ఉండటంతో వాటిని అతి జాగ్రత్తగా నడపాల్సిన అవసరం ఉంది. గురుత్వాకర్షణ తక్కువగా ఉండటం వల్ల చంద్రునిపై లేచిన దుమ్ము తిరిగి నెమ్మదిగా ఉపరితలం చేరుకోడానికి ఎంతో సమయం పడుతుంది. చంద్రుని చేరుకున్న వారు ఎవరైనా అక్కడి ఉపరితలాన్ని తమకాళ్లతో గట్టిగా తన్ని పైకెగిరితే వారు ఎంతో ఎత్తుకు ఎగురగలుగుతారు. ఒలింపిక్‌ రికార్డును కూడా సునాయాసంగా అధిగమించగలరు.

Post a Comment

0 Comments