సంఖ్యావాచక పదాలు
షడ్రుచులు: - మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు ( కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు)
షట్చక్రవర్తులు:
- హరిశ్చంద్రో నలో రాజ,పురుకుత్స:పురూరవా:I సగర: కార్త వీర్యశ్చ,షడేతే............ చక్రవర్తిన:II
హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు
షడ్విధ పరమార్థ శత్రువులు : 1.కామము. 2. క్రోదము, 3.లోబము. 4. మోహము. 5. మదము. 6. మాత్సర్యము
షడ్విధ నరకములు : 1. తపనము. 2. అవీచి. 3. మహాకావరము. 4. కావరము. 5. సంఘాతము. 6. కాలసూత్రము.
షడ్విధ గుణములు : (రాజనీతి యందు) 1. సంధి. 2. విగ్రహము, 3. యానము. 4. సంస్థాపనము. 5. ఆసనము. 6. ద్వైధీభావము
0 Comments