GET MORE DETAILS

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేశాయ్‌..

 జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేశాయ్‌...



 దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు జరగ్గా.. ఆ ఫలితాలను ఖరగ్‌పూర్‌ ఐఐటీ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మొత్తం 50వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను 20వేల మంది విద్యార్థులు రాశారు. రేపట్నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 25వరకు రిజిస్ట్రేషన్లు, 27న సీట్లు కేటాయింపు జరపనున్నారు. ఫలితాల కోసం https://jeeadv.ac.in/వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

మెరిసిన తెలుగు విద్యార్థులు..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 1,51,193మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా.. 1,41,699మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాల్లో 41,862మంది అర్హత పొందారు. అర్హత సాధించిన వారిలో 35,410 మంది బాలురు కాగా.. 6452మంది బాలికలు ఉన్నారు. ఈ ర్యాంకుల ఆధారంగా ఐఐటీలు సహా 114 విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఖరగ్‌పూర్‌ ఐఐటీ విడుదల చేసిన ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. దేశవ్యాప్తంగా చూస్తే.. జనరల్‌ కేటగిరీలో మృదుల్ అగర్వాల్‌కు మొదటి ర్యాంకు రాగా.. బాలికల విభాగంలో కావ్య చోప్రాకు ప్రథమ ర్యాంకు లభించింది. అలాగే, జనరల్‌ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో రామస్వామి సంతోష్‌రెడ్డికి తొలి ర్యాంకు, ఎస్సీ కేటగిరిలో నందిగామ నిఖిల్‌కు మొదటి ర్యాంకు లభించాయి. ఈ ఫలితాల్లో గుంటూరు జిల్లాకు చెందిన రుషికేశ్‌రెడ్డికి పదో ర్యాంకు రాగా.. విజయవాడకు చెందిన దివాకర్‌ సాయికి 11వ ర్యాంకు వచ్చింది.

100 లోపు అడ్వాన్స్‌డ్‌ ర్యాంకర్లకు ఖర్చులు మావే.. ఖరగ్‌పూర్‌ ఐఐటీ ప్రకటన

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 100 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు చేరిన ఐఐటీలను నిపుణులు ఉత్తమమైనవిగా భావిస్తుంటారు.

Post a Comment

0 Comments