GET MORE DETAILS

సకాలంలోనే ఫీజు రీయింబర్స్మెంటు - ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి

 సకాలంలోనే ఫీజు రీయింబర్స్మెంటు - ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి




 రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంటు చెల్లింపులన్నీ సకాలంలోనే చెల్లిస్తున్నామని, ఎక్కడా ఆలస్యం జరగడం లేదని ఎపి ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు. మొత్తం 87 శాతం విద్యార్థులకు పూర్తిగా చెల్లింపులు చేశామన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో. మాట్లాడారు. 2019 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ కింద చెల్లించిందన్నారు. ఇందులో రూ.1,880 కోట్ల గత ప్రభుత్వ బకాయిలు అని తెలిపారు. వివిధ అంశాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తున్నందున పిజి కోర్సులకు చెల్లింపులను నిలిపివేశామన్నారు. గతంలో ఏడాదికి ఒకేసారి చెల్లించడం వల్ల కళాశాలల యజమాన్యాలు ఇబ్బందులు పడ్డాయని, అందుకే ఈ ఏడాది నుంచి క్వార్టర్లీ చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రెండు క్వార్టర్లు చెల్లించామని, ఒక క్వార్టర్ మాత్రమే బకాయి ఉందని, దాన్ని కూడా నవంబరులో చెల్లిస్తామని తెలిపారు.

హైకోర్టు ఉత్తర్వుల తర్వాతే డిగ్రీ తరగతులు :

డిగ్రీ తరగతుల నిర్వహణపై హైకోర్టు ఉత్తర్వుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ ప్రవేశా సంబంధించిన వెబ్ ఆప్షన్లను ఈ నెల 17 వరకు ఎంచుకోవచ్చని తెలి తుది నిర్ణయం కోర్టు తీర్పు తర్వాత తీసుకుంటామని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments