మన పండుగల గొప్పతనం తెలుసుకోండి
❤ ఉగాది:- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
🧡 శ్రీరామ నవమి:- భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
💛 అక్షయ తృతీయ:- విలువైన వాటిని కూడబెట్టుకోమని.
💚 వ్యాస (గురు) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
💙 నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
💜 వరలక్ష్మి వ్రతం :- నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
💝 రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
💞 వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
🖤 పితృ అమావాస్య:- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
💘 దసరా ( ఆయుధ పూజ) :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
💖 దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
❣ కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
💕 సంక్రాంతి :- మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
💓 మహాశివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
💝 హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.
0 Comments