GET MORE DETAILS

సుమో , టాటా సుమో అంటే ఓ భారతీయుడిపేరే.

 సుమో , టాటా సుమో అంటే ఓ భారతీయుడిపేరే.




ప్రపంచంలో మొదటికారు బెంజ్. 1886లో జర్మని దేశానికి చెందిన కార్ల్ బెంజ్ దీనిని కనుక్కోవడం జరిగింది. అపుడు ఈ కారుకు మూడు చక్రాలేవుండేవి. కాని

ప్రపంచానికి కార్లను సామాన్‌యులకు పరిచయం, అందుబాటులోనికి తెచ్చింది మాత్రం అమెరికాలోని  ఫోర్డ్ కంపెని.1907లో ఫోర్డ్ కార్ల పరిశ్రమను స్థాపించడం జరిగింది.

భారతదేశంలో మొదటిసారిగా కారును కొన్న భారతీయుడు జంషెడ్ జీ తాతా. 1898 లో జంషెడ్ జీ కారును కొనడం జరిగింది. కాని

1897లోనే ఫోస్టర్ కు చెందిన క్రాంప్టన్ ఆండ్ గ్రీవ్స్ ఆంగ్లేయకంపెని కారును తొలిసారిగా భారతదేశానికి తీసుకురావడం జరిగింది.

రాజస్థాన్ లోని అళ్వార్ మహరాజు  జైసింగ్ ప్రభాకర్  1920లో ఒకసారి ఇంగ్లాండ్ సందర్శించడం జరిగింది. కారుకొనెటందుకు, మహారాజులా కాకుండా సాధారణ వ్యక్తిగా రోల్స్ రాయిస్ కార్ల షోరూం కు జరిగింది. ఎవరో సాధారణ పేద భారతీయుడని తెల్లవాళ్ళు షోరూంలోనికి రానివ్వలేదు.

దాంతో కోపగించిన ఆ మహారాజు మూడు రోల్స్ రాయిస్  కార్లను కొని వాటిముందుభాగంలో చీపుర్లను కట్టి అళ్వార్ వీధులలో చెత్త ఊడ్చే బండ్లగా ఉపయోగించసాగాడు. రోల్స్ రాయిస్ కారంటేనే హోదాకు చిహ్నం. భారతీయ సంస్థానాధీసుల వద్ద అప్పటికే దాదాపుగా 1000  వరకు కార్లుండేవి. అళ్వార్ మహరాజు ఈ కార్లను చెత్త ఊడ్చడానికి ఉపయోగిస్తున్నాడని కార్ల కంపెనీకి తెలియగానే  కార్ల గౌరవం మంటకలుస్తోందని, వారు దిగివచ్చి తమ తప్పిదానికి క్షమాపణలు కోరడం జరిగింది.

భారతదేశంలో మొదటగా తయారైన కారు అంబాసిడర్. 1958లో అంబాసిడర్ పరిశ్రమను కోల్ కత లో (హిందూస్థాన్ అంబాసిడర్ గా) ఏర్పాటుచేయడం జరిగింది.

2008 లో భారతదేశంలో తయారైన టాటా నానో కారు ప్రపంచంలోనే అతి చౌకైన కారుగా గుర్తింపు పొందింది..

1982లో భారత ప్రభుత్వం మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ను ఏర్పాటుచేసి జపాన్ దేశపు సుజుకి కార్ల కంపెనీ సాయంతో మారుతి సుజుకి కార్లను పంజాబులో ప్రారంభించింది.

భారతదేశంలో ముంబాయి కేంద్రంగా 1945 లో  టాటా లోకోమోటివ్ పరిశ్రమను స్థాపించడం జరిగింది. 1954లో Dailmer Benz సహకారంతో  వాణిజ్యపరమైన వాహనాల ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది.

1988 లో TATA Sierra కారును ప్రవేశపెట్టడం జరిగింది. 1998లో పూర్తి స్వదేశీవిజ్ఞానంతో టాటా ఇండికా కారును ప్రవేశపెట్టడం జరిగింది.)

టాటా కంపెనిలో సుమంత్ మోల్గాంకర్ అనే వ్యక్తి పేరుమోసిన కార్ల ఇంజనీరు. అతని పేరులోని మొదటి ఆంగ్ల అక్షరాలతో సుమో  అనిపేరుపెట్టి జీపును 1994లో వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడం జరిగింది. మనకు తెలుసు టాటా సుమో ఎంత ప్రసిద్ధికెక్కిందో.

 jeep (జీపు) అనేమాట మనకు సుపరిచితం.ఒకపుడు ప్రభుత్వ అధికారులకు పోలీస్ సిబ్బందికి జీపులనే కేటాయించేవారు.

1936లో జీపును కనుగొనడం జరిగింది. అప్పట్లో సైనికదళంలో సాధారణ కార్యక్రమం (General Purpose)  కొరకు ఈ వాహనాన్ని వాడేవారు. జనరల్ పర్పస్ ను హ్రస్వరూపంలో GP (జీపి)అనేవారు.ఆ GPనే పలుకడంలో జీపుగామారి స్థిరపడిపోయింది.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో మారుతి సుజుకి ప్రథమస్థానంలో వుండగా, హ్యుందాయ్, మహీంద్రా అండ్  మహీంద్రా, టాటామోటార్స్, హోండా కంపెనీలు తదుపరి స్థానాన్ని ఆక్రమించాయి.

ట్రాక్టర్ల విషయానికి వస్తే 1812 లో పంట నూర్పిడి కోసం ఓ ఆవిరి యంత్రాన్ని కనుక్కోవడం జరిగింది. 1893లో ప్రస్తుత ట్రాక్టర్ ఆకారం అమెరికాలో రూపుదిద్దుకొంది.

1896లో జర్మనీదేశానికి చెందిన గొట్లేబ్ డాల్మెలెర్ ట్రక్ (లారీ) ని  కనుకోవడం జరిగింది.


జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

Post a Comment

0 Comments