GET MORE DETAILS

ఆయన స్పూర్తితో భగత్ సింగ్...ఆయనే కర్తార్ సింగ్ (నేడు కర్తార్ సింగ్ వర్ధంతి)

 ఆయన స్పూర్తితో భగత్ సింగ్...ఆయనే కర్తార్ సింగ్ (నేడు కర్తార్ సింగ్ వర్ధంతి)
భారత దేశ స్వాతంత్ర సంగ్రామం పలు రూపాల్లో జరిగింది. గాంధీజీ అహింసా పద్ధతిలో పోరాడగా,భగత్ సింగ్ వంటివారు విప్లవ బాట పట్టారు.నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న భగత్ సింగ్ కి మరొక విప్లవకారుడు స్ఫూర్తినిచ్చారు.ఆయనే కర్తార్ సింగ్.

"1915 నవంబర్. అప్పుడే వస్తున్న నూనూగుమీసాలతో చాలా అమాయకంగా,ఎంతో తేజోవంతమైన ముఖంతో ఫిరోజ్ పూర్ కోర్టు బోనులో నిలబడివున్నాడు మన కర్తార్. 

చురుకైన చూపులతోనూ,పెదాలపై చక్కని చిరునవ్వుతో కనిపిస్తున్న ఆ యువకుడి వంక ఒకనిమిషం తదేకంగా చూసాడు జడ్జిగారు. గొంతుసవరించుకుంటూ  నీవు విప్లవకారులతో కలిసి కంటోన్మెంట్ పై బాంబులతో దాడికి పథకం రచించావా? అని అడిగాడు జడ్జి. అవును స్థిరంగా బదులిచ్చాడాయువకుడు. అతని సమాధానం విని ఆశ్చర్యపోయాడు జడ్జి. ఆ యువకుడికి శిక్షవేయాలంటే మనసురావడంలేదతనికి. చేసినది తప్పు అని క్షమాపణ అడుగు,శిక్షతగ్గించి వదిలేస్తానన్నాడాజడ్జి. చిన్నగా నవ్వాడాయువకుడు.నేను ఆంగ్లేయదోపిడీ మీద దాడి చేసాను.వారినే క్షమాపణ అడుగుతానా?? మీరు నాకు ఉరిశిక్షవేయండి.మళ్ళీ జన్మ అంటుా వుంటే మళ్ళీ ఇదేగడ్డమీదపుట్టి మళ్ళీ మీతో పోరాడాలని కోరుకుంటానని అన్నాడు.. ఆ మాటలకు కోపంతో ఊగిపోయాడాజడ్జి..ఆ యువకుడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పుచెప్పి గబగబ లేసి వెళ్ళిపోయాడు.

1915 నవంబరు 17 ఆ యువకుడిని ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతనిని చూడటానికి వచ్చాడు అతని తాత బదన్ సింగ్ . మనవడిని చూడగానే వలవలా ఏడ్చాడతను. ఏడుస్తున్న తాతను ఓదార్చుతూ..తాతా..ఎందుకు ఏడుస్తున్నావు?? నేనేమీ మీరు తలదించుకొనే పనిచేయలేదు. ఒక పోరాటవీరునిగా ఆత్మార్పణ చేస్తున్నాను.దేశం కోసం పోరాటం చేయమంటే మామూలు విషయం కాదు.ఎన్నో త్యాగాలు చేయాలి అంటారాయన.

కర్తార్ సింగ్ సరాభా ది గ్రేట్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ "1896 మే 24 న పుట్టిన కర్తార్ సింగ్ నాలుగేళ్ళకే తండ్రిపోగొట్టుకున్నాడు. తాత దగ్గరే పెరిగాడు. 1912 లో చదువుల కొరకై అమెరికా వెళ్ళాడు. అక్కడ గద్దర్ పార్టీలో చేరాడు. బాంబులు తయారుచేయడం ,ప్రయోగించడం నేర్చుకున్నాడు. అత్యంత చురుకైన కార్యకర్తగా పేరు సంపాదించుకున్నాడు. ఆయుధపోరాటం ద్వారానే స్వాతంత్రం సంపాదించాలనే ఆశయంతో 1915 ఫిబ్రవరి 21 న 20 వేలమంది విప్లవకారులతో ఫిరోజ్ పూర్ కంటోన్మెంట్ పై దాడి ద్వారా సమరం మొదలుపెడుదామనుకున్నాడు.కానీ "కృపాల్ సింగ్ అనే నమ్మకద్రోహివల్ల కర్తార్ సింగ్ తో పాటు 80 మందిని పోలీసులు అరెష్ట్ చేసారు.

" కర్తార్ సింగ్ పేరు స్వాతంత్రసంగ్రామచరిత్రలో కనిపించదు.కనీసం మన పాఠ్యపుస్తకాలలోనూ వినిపించదు కానీ 19 యేండ్లకే ఈ దేశస్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధుడు అతడు.

విప్లవకారుల్లో అత్యంత ప్రమాదకారిగా కర్తార్ సింగ్ ని బ్రిటిష్ అధికారులు పరిగణించారు. భగత్ సింగ్ వంటి వారికి స్ఫూర్తినిచ్చారు.ఆయన త్యాగం నేటి యువతకు ఆదర్శం.


(నేడు కర్తార్ సింగ్ వర్ధంతి)


Post a Comment

0 Comments