జాతక రీత్యా అత్తా కోడల మధ్య సంబంధం
వివాహం తర్వాత అత్తా కోడల మధ్య సఖ్యత ఉంటుందా లేదా విరోధం ఉంటుందా చాలా మందికి తెలుసుకోవాలని కోరిక ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో దీని గురించి చాలా వివరంగా ఉంది. జాతకరీత్యా చంద్రగ్రహము తల్లి లేదా అత్తగారు ఈ విధమైన పెద్ద వయసు వాళ్ళను సూచిస్తుంది. శుక్ర గ్రహము అమ్మాయిని సూచిస్తుంది.
ఒక అమ్మాయి యొక్క జాతకంలో శుక్ర భగవానుడు చంద్రుడు కలిసి ఉంటే ఆ అమ్మాయికి అత్తగారితో విరోధం ఉంటుంది. ఎందుకంటే శుక్ర భగవానుడు చంద్రుడు శత్రువులు. మరొక విధంగా కూడా చూడవచ్చు. అమ్మాయి యొక్క సప్తమ స్థానము భర్త స్థానము భర్త యొక్క తల్లి అంటే సప్తమ నుండి చతుర్ధ స్థానము అత్తగారి యొక్క స్థానము.
అనగా అమ్మాయి యొక్క లగ్నం నుండి పదవ స్థానము పరిశీలించినప్పుడు లగ్నాధిపతి మరియు దశమాధిపతి ఇద్దరూ మిత్ర గ్రహాలు అయినా సమగ్రహాలైన అత్తా కోడలు మధ్య బాంధవ్యం బాగుంటుంది ఈ రెండింటి మధ్య శత్రుత్వం కానీ ఏర్పడితే అత్తా కోడల మధ్య విరోధం ఉంటుంది.
వివాహ పొంతన విషయంలో అత్తగారి యొక్క జాతకము కాబోయే కోడలి యొక్క జాతకము రెండు పరిశీలించినప్పుడు కాబోయే కోడలు తో అత్తగారు ఏ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. కుమార్తె గాని కుమారుడి కానీ వివాహ విషయంలో వివాహ పొంతన చూసినప్పుడు ఇటువంటి విషయాలు తెలుసుకోవచ్చు.
0 Comments