GET MORE DETAILS

మన పూర్వీకులు వాడిన ఆయుధాల గురించి విన్నారా...?

 మన పూర్వీకులు వాడిన ఆయుధాల గురించి విన్నారా...?




(1) చక్రం (2) తోమరం (3) పాషాణం (4) అంకుశం (5) పాశం (6) కుంత (7) క్షరికా (8) ఆసి (9) గద (10 ) ముసలం 


(11) దండం (12) వాగురా (13) చాపం (14) శతఘ్ని (15) శల్యక (16) మంజూషార్క (17) సురియ(18) ముప్పిడియమ్ము (19) కఠారము (20) తరువలి


(21) కొంగవాలు (22) గండ్రగొడ్డలి (23) కత్తి (24) ఆడిదము (25) కుంతము (26) సబళము (గడ్డపార) (27) ఇనుపకోల (28) పట్టెము (29) డొంకెన (30) క్రోంకులు 


(31) క్రోంకులు (32) బ్రద్దపరులు (33) వడిసెల (34) దంచనపు గుండ్లు (35) ప్రాస (36) సెలకట్టె (37) శూలము (38) కుమ్ముడుదగరు (39) బల్లెము (40) ముద్గరం.


(41) ఒడ్డునము (42) కణయము (43) కంపణము (44) మొలలకఠారు (45) పలకలు (46) క్షురపము (47) రోహణము (48) వజ్రముష్టి (49) లౌడివంకిణి (50) బింధివాలము.


(51) భల్లాతకము (52) శిలాయంత్రము (53) జబురజంగులు (54) గ్రద్దగోరులు (55) ధనుస్సు.


పై ఆయుధాలన్ని సమయానుకూలంగా యుద్ధాలలో 17వ శతాబ్దివరకు మనవీరులు వాడారు.


 చాలా వాటికి పేర్లుతప్ప అవి ఏ ఆకారంలోవుంటాయో, ఎలా ప్రయోగించారో, ఎందుకు ప్రయోగించారో ఆధునీకులైన మనం మరచిపోయాం.


పురాణఆయుధప్రయోగాలు.... ఇప్పటికొందరు నమ్మినా, నమ్మకపోయినా వాటిని ప్రయోగించినమాట వాస్తవం. కాకపోతే వాటి తయారి విజ్ఞానాన్ని మరచిపోయామంతే.


శతఘ్ని = శత = నూరు అఘ్ని = చంపునది. ప్రస్తుతం మిస్సైల్ లాంటిది, లేదా ఫిరంగి వంటిది. ఒకసారి ప్రయోగిస్తే నూరుమందిని సంహరించేదో లేక నూరు యోజనాల దూరాన్ని తాకేదైవుంటుంది.


బ్రహ్మస్త్రం = ఈ అస్త్రం ప్రయోగించిన వెంటనే బ్రహ్మండమైన శక్తి (ఆటంలాగా ?) ఉద్భవించి శత్రువుల ఆయుధాలను భస్మంచేసి, శత్రువుల కంఠాలను కట్ చేస్తుంది.


ఆగ్నేయాస్త్రం = దీనిని ప్రయోగిస్తే ఉరుములు, మెరుపులు, నిప్పులు వెదజల్లుతూ శత్రునాశనం చేస్తుంది.


వారుణాస్త్రం = జడివాన కురిపిస్తూ, వరదలు సృష్టిస్తూ శత్రువులను చీకాకుపరుస్తుంది.


నాగాస్త్రం = పామురూపంలో ఉండి, ప్రయోగించగానే భయంకర విషాగ్నులు కురిపించి శత్రువులను నాశనం చేస్తుంది..


గరుడాస్త్రం = గరుడరూపంలో ఉన్న అస్త్రం. ప్రయోగించగానే ప్రచండగాలులు సృష్టిస్తూ, భయంకరమైన గోళ్ళతో రక్కి, ముక్కుతో పొడుపొడుస్తూ శత్రునాశనం చేస్తుంది.

గరుడాస్త్రంను నాగాస్త్రం కు విరుగుడుగా ప్రయోగిస్తారు.


ఇంకా పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం, రామాస్త్రం, పరశురామాస్త్రం, . రుద్రాస్త్రం, భార్గవాస్త్రం, వజ్రాయుధాస్త్రం లాంటివి కోకొల్లలుగా పురాణ ఇతిహాసాలలో వున్నాయి.


జిబి.విశ్వనాథ.9441245857, అనంతపురం.

Post a Comment

0 Comments