GET MORE DETAILS

యాపిల్‌ కంపెనీ ఉద్యోగుల జీతం ఎంతో తెలుసా...?

యాపిల్‌ కంపెనీ ఉద్యోగుల జీతం ఎంతో తెలుసా...?



ఇంటర్నెట్‌ డెస్క్‌: మనలో చాలా మందికి వివిధ కంపెనీలు ఇచ్చే జీతాలు ఎలా ఉంటాయి? అని ఆరా తీయడం అలవాటు. అలాంటి వారికి ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ ‘యాపిల్‌’ (Apple)లో ఇంజినీర్లు, డిజైనర్లుగా పనిచేసే వారు ఏ మాత్రం సంపాదిస్తారో తెలుసుకోవాలనే ఉత్సుకత ఉండడం సహజం. ప్రముఖ అమెరికన్‌ బిజినెస్‌ వెబ్‌సైట్‌ ‘బిజినెస్‌ ఇన్‌సైడర్‌’ సైతం ఇదే పనిచేసింది. ట్రెండ్‌కి తగ్గట్టు కొత్త మార్పులతో ఐఫోన్‌ (iPhone), మ్యాక్‌ (Macs) ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎన్నో కసరత్తులు చేసే అక్కడి డిజైనర్లు, ఇంజినీర్ల జీతం ఏమాత్రం ఉంటుందనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. యూఎస్‌ ఆఫీస్‌ ఆఫ్‌ ఫారిన్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌కు యాపిల్‌ కంపెనీ తెలియజేసిన వేతన వివరాలు ఆధారంగా ఈ లెక్కల్ని సేకరించింది.


హోదా పరంగా జీతం ఏడాదికి ఇలా...

* సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కి 1,28,200- 2,20,000 డాలర్లు (సుమారు రూ.95 లక్షల నుంచి రూ.1.63 కోట్లు)


* సాఫ్ట్‌వేర్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్లు 2,39,871 డాలర్లు (సుమారు రూ.1.78 కోట్లు)


* మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజినీర్లు 2,50,000 డాలర్లు (సుమారు రూ.1.86 కోట్లు)


* టెస్టింగ్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్‌ 137,275 డాలర్లు (సుమారు రూ.1.02 కోట్లు)


* ప్రొడక్షన్‌ సర్వీస్‌ ఇంజినీర్‌ 1,50,000 డాలర్లు (సుమారు రూ.1.11 కోట్లు) 


* సాఫ్ట్‌వేర్‌ డెవలెప్‌మెంట్‌ ఇంజినీర్‌ 1,25,000 డాలర్లు (సుమారు రూ.93లక్షలు)


* మెషిన్‌ లెర్నింగ్‌ రీసెర్చ్‌ ఇంజినీర్‌ 2,11,300 డాలర్లు (సుమారు రూ. 1.57 కోట్లు)

Post a Comment

0 Comments