GET MORE DETAILS

ఆదివాసీల తొలిబాణం : : (నేడు బిర్సా ముండా జయంతి)

 ఆదివాసీల తొలిబాణం : : (నేడు బిర్సా ముండా జయంతి)




వ్యాపారం పేరుతో దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు భారతీయులని అన్ని రకాలుగా దోచుకున్నారు.సహజ వనరులను ఇంగ్లండ్ కి తరలించారు. తమ సామ్రాజ్య విస్తరణకు మతాన్ని కూడా ఒక ఆయుధంగా వాడుకున్నారు.గిరిజనుల హక్కులని కాలరాశారు.1850తరువాత బ్రిటిష్ వారిని క్రమంగా భారతీయులు ఎదిరించసాగారు.ఫలితంగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు వచ్చాయి. అవిభక్త బెంగాల్ రాష్ట్రంలో బిర్సా ముండా,తెలంగాణ ప్రాంతంలో కొమరం భీం,ఆంధ్రా ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు ఆయా కాలాల్లో అణగారిన వర్గాల వారి హక్కుల కోసం పోరాడారు. బిర్సా ముండా గిరిజన ఉద్యమాలకు దేశంలో పునాదులు వేశారు.

బిర్సా ముండా జార్ఘండ్ లోని ఖుంతీ జిల్లా ఉలిహతు గ్రామంలో నవంబర్ 15, 1875 లో జన్మించాడు.  బిర్సా తండ్రి సుగణ ముండా జన్మస్థలం ఉలిహటు. బిర్సా చిన్నప్పుడు క్రైస్తవ మిషనరీ పాఠశాలలో చదువుకున్నారు.యూరోప్ ఖండంలో ప్రజలు ఏ విధంగా స్వేచ్చా వాయువులు పీల్చుతున్నారో అధ్యయనం చేశారు. ఇటువంటి వాతావరణం తన జాతి ప్రజలకు కూడా ఉండాలని ఆశించారు.అందుకు పోరుబాట పట్టారు.గిరిజనులని చైతన్య పరిచారు.

బిర్సాముండా అంగ్లేయులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడానికి బ్రిటిష్ వారు ముండా ఇంకా కోల్ జనజాతి వారిని దాదాపు 40 మందిని జైల్లో బంధించారు. 

జైలులో బిర్సాముండా ఎప్పుడు మరణించారు ఎవరికీ తెలియదు. (చాలా కాలానికి 1900 జూన్ 9వ తేదీన బిర్సా తుది శ్వాస విడిచినట్లు సమాచారం ఇచ్చారు) అయితే తన పోరాటంలో అతడు అంతగా ప్రఖ్యాతి పొందారు అంటే ఆనాటి పత్రికల నీ ముక్తకంఠంతో బ్రిటీష్ వారి దమనకాండ ని నిరసన తెలిపాయి. తానొక్కండై మొత్తం ముండా సమాజాన్ని తన వెంట నడిపించిన నాయకుడు బిర్సాముండా, చివరికి తన వారి స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయుల తుపాకీ గుళ్ళుకి బలి అయ్యాడు.

కేంద్రం ఆయన జయంతిని జనజాతీయ ఆత్మ గౌరవ దినోత్సవంగా ప్రకటించింది.రాంచీ విమానాశ్రయనికి ఆయన పేరు పెట్టారు.బీహార్,బెంగాల్ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఆయనను

ఒక దైవంగా కొలుస్తారు.పిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన బిర్సా ముండా నేటి తరానికి ఆదర్శం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

Post a Comment

0 Comments