GET MORE DETAILS

ధర్భల విశిష్టత...

ధర్భల విశిష్టత...

      




ధర్భలు  పవిత్రమైనవి. హిందువులు అనేక కార్యాలకు దర్భలను ఉపయోగిస్తారు. ధర్భలకి మంత్రాలను గ్రహించగల శక్తి వున్నది.

మన శరీరానికి చెడును కలిగించే కిరణాలనుండి కాపాడగల శక్తి దర్భలకు ఉన్నదని వైజ్ఞానికులు ఒప్పుకుంటున్నారు. అందుకే గ్రహణ సమయంలో గృహాలలోని నీటి బిందెలలోను, ఆహార పదార్ధాల పాత్రలలోనూ మన పెద్దవారు  దర్భలను వేసేవారు.
క్రతువులకు , పితృకార్యాలకు దర్భలను వుపయోగిస్తారు.

మన పూర్వీకులు తమ ధ్యాన సమయంలో, పూజ సమయంలో దర్భాసనాలమీదే కూర్చొనేవారు. యజ్ఞ యాగాదుల సమయంలో  కలశంలో దర్భలకట్టను  పెట్టడం మనం చూస్తాము.   

ఈ ధర్భల గుఛ్ఛం ఒక ariel గా పనిచేసి బయట పఠించేమంత్ర శక్తిని గ్రహించి కలశంలోని జలానికి చేరుస్తుంది ఆలయాలలో జరిగే కుంభాభిషేకాల సమయంలో , యాగశాలలో అమర్ఛబడిన కలశాల నుండి  పైన వున్న విమాన కలశాలతో సహా  గర్భగుడిలో ప్రతిష్టించిన మూలవిగ్రహానికి దర్భలతో చేసిన త్రాడు తో కలుపుతారు. 

యాగశాలలో జరిపే యాగ క్రియల ఫలితాలు దర్భ త్రాడు ద్వారా మూలవిగ్రహానికి  చేరి ఆధ్యాత్మిక  ప్రకంపనలు ఆలయం నలుమూలలా ప్రసరిస్తాయి.

విశేష పూజల నుండి పితృ తర్పణాల దాకా దర్భతో చేసిన పవిత్రాన్ని ఉంగరం వ్రేలుకు ధరించి కార్యాలు ఆచరిస్తారు. ఉంగరపు వ్రేలుకు పవిత్రాన్ని ధరించినప్పుడు  రక్త ప్రవాహం క్రమబధ్ధమౌతున్నది.

మనసు కి ఏకాగ్రత ఏర్పడి చేసే కార్యం సక్రమంగా నిర్వహించబడుతున్నది. ధర్భల మహిమ  అనుభవించవలసినదే తప్ప మాటలలో వివరించలేము.

Post a Comment

0 Comments