GET MORE DETAILS

పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యునివైపే తిరగడానికి కారణం ఏమిటి ?

పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యునివైపే తిరగడానికి కారణం ఏమిటి ?




పొద్దు తిరుగుడు పువ్వు (దీనిని సూర్యకాంత పుష్పం Sun flower) అని కూడా అంటారు. సూర్యుడు తూర్పున ఉదయించింది మొదలు సాయంత్రం పడమరలో అస్తమించే వరకు అది సూర్యుని వంకే చూస్తున్నట్లుగా తిరుగుతూ ఉంటుంది

ఈ పువ్వు ఇలా తిరగడానికి కారణం ఈ మొక్కలో ఉండే ఫొటోట్రాపిజం అనే లక్షణమే. ఫొటోట్రాపిజం అంటే, కంటికి కనిపించే సూర్యరశ్మి వలన మొక్క పెరుగుదలతోపాటు కలిగే ప్రతిస్పందన అని చెప్పుకోవచ్చు. పొద్దుతిరుగుడు మొక్క కాండంలో ఉండే 'ఆక్సిన్‌' అనే హార్మోన్‌ ఈ స్పందనను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్‌ మొక్కలు పొడవుగా, ఏపుగా పెరగడానికి దోహదపడుతుంది. మొక్కల్లో ఉన్న ఎమినో ఆసిడ్‌ (amino acid) వల్లగాని, కార్బోహైడ్రేటులో విచ్ఛిన్నం కావడం వల్ల గాని ఈ హార్మోన్‌ ఏర్పడుతుంది. ఈ హార్మోన్‌ మొక్కలో ఉన్న కణాల గోడలపై ఉన్న కార్బోహైడ్రేటుల బంధాలపై పనిచేస్తాయి. తద్వారా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి

'ఫొటోట్రాపిజం' ధర్మం ఉన్న పొద్దుతిరుగుడు మొక్కపై సూర్యరశ్మి నేరుగా పడినపుడు ఆ మొక్క వెనుక భాగంలో అంటే పువ్వు వెనుక ఉన్న కాండంపై నీడ ఉంటుంది. సూర్యరశ్మి నేరుగా సోకని ఆ చీకటి భాగాలలో 'ఆక్సిన్‌' హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఆ భాగం వేగంగా పెరుగుతుంది. అందువల్ల ఆ దిశలో మొక్క, దానితోపాటు పొద్దుతిరుగుడు పువ్వు కదులుతాయి. నీడలో ఉండే కాండం పెరిగే కొద్దీ, ఆ పెరుగుదల మొక్కను నీడనుంచి సూర్యరశ్మి పడే దిశలోకి కదిలిస్తుంది. ఫలితంగా పొద్దుతిరుగుడు పువ్వు ఎప్పుడూ సూర్యుణ్ని చూస్తూ ఆనందపడుతుంది.

Post a Comment

0 Comments