GET MORE DETAILS

పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ కు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ.

 పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ కు ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ.




🔮వృద్ధాప్యం మీదపడుతున్న పెన్షనర్లు దూరంలో సంబంధిత కార్యాలయాలకు తాము నేరుగా వచ్చి లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించాల్సి వచ్చేది.


🔮అలాంటి వారికి లైఫ్ సర్టిఫికెట్ విషయంలో ఎంతగానో సాయపడే కొత్త రకం ఫేస్ రికగ్నేషన్ సాంకేతికతను కేంద్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది.


🔮ప్రతీ సంవత్సరం ఒకసారి ఖచ్చితంగా సంబంధిత ప్రభుత్వ శాఖకు సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెటు ఇకపై ఒక సాక్ష్యంగా పనికొచ్చే 'యునీక్' ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీని పెన్షన్ల శాఖ కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం ప్రారంభించారు.


🔮పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ను డిజిటల్ రూపంలో ఇచ్చేందుకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ ఒక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.


🔮'యునీక్ ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ వారికి మరింతగా ఉపయోగపడనుందని మంత్రి చెప్పారు.


🔮68 లక్షల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లతోపాటు ఈపీఎఫ్ ఓ, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని వారికీ ఈ టెక్నాలజీ సహాయకారిగా ఉంటుందన్నారు.

Post a Comment

0 Comments