GET MORE DETAILS

డిశంబర్ 10 - నోబెల్‌ పురస్కారం

 డిశంబర్ 10 - నోబెల్‌ పురస్కారంనోబెల్‌ పురస్కారం ఏఏ రంగాలలో ఎవరికి ఇవ్వబడుతుంది? అసలు నోబెల్‌ పురస్కారం అంటే ఏమిటి? దీని విశిష్టత ఏమిటి? ఈ అవార్డులు ఎపుడు ప్రధానం చేయబడతాయి మొదలగు అంశాలను నోబల్ బహుమతి సృష్టికర్త ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌  వర్ధంతి  సందర్భంగా విశ్లేషించుకుందాం !

నోబెల్ బహుమతులు ప్రపంచం లోని మేధోపరమైన సాధనకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులుగా విస్తృతంగా పరిగణించ బడుతున్నాయి.

భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్య  శాస్త్రం ( ఔషధరంగం), ఆర్థిక శాస్త్రం, సాహిత్యం, శాంతి అనే ఆరు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి  ప్రపంచ ప్రఖ్యాత చెందిన  నోబల్ బహుమతి ఇవ్వబడుతుంది. 

డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం  ప్రతి సంవత్సరం ఆరు నోబెల్ అవార్డులు  ఎవరైతే వారి చర్యల ద్వారా మానవజాతికి ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తారో వారికి  ప్రదానం చేయబడతాయి.

నోబెల్ బహుమతులు ఎక్కడ ఇస్తారు ?

నోబెల్ బహుమతులు స్వీడన్ లో ఇవ్వబడుతుండగా, నోబెల్ శాంతి బహుమతి మాత్రం నార్వేలో ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ బహుమతులు ప్రారంభం నాటికి నార్వే మరియు స్వీడన్ ఒక దేశంగా ఉన్నాయి.

ఆల్ఫ్రెడ్ నోబెల్ :

ప్రముఖ స్వీడిష్  రసాయన శాస్త్రవేత్త, 

ఇంజనీరు, 

ఆవిష్కారకుడు,

 మిలిటరీ ఆయుధాలతయారీదారు మరియు 

డైనమైట్ ఆవిష్కారకుడు. 

ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. 

ఈయన  వీలునామాలో నోబెల్ బహుమతి  కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కేటాయించాడు. నోబలో 1895లో రూపొందించిన వీలునామాలో, తన సంపదలో ఎక్కువ భాగాన్ని ఐదు వార్షిక బహుమతులు ప్రదానం చేయడానికి " ముందు సంవత్సరంలో, మానవాళికి గొప్ప ప్రయోజనాన్ని అందించిన వారికి" కేటాయించాలని సూచించాడు.     ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో  నోబెల్‌ మరణించిన 5 సంవత్సరాల తరువాత నోబెల్  పురస్కారం ప్రారంభించబడింది. 

ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం  బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ద్వారా 1968లో నోబలో శాంతి బహుమతి స్థాపించబడి 1969లో మొదటిసారిగా ప్రదానం చేయబడింది. సాంకేతికంగా నోబెల్ బహుమతి కానప్పటికీ, అది అవార్డుతో సమానంగా గుర్తించబడింది.ఈ విజేతలు నోబెల్ బహుమతి గ్రహీతలతో ప్రకటించబడతారు.

ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు  ఇవ్వబడతాయి.

 నోబెల్ బహుమతి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది ?

నోబెల్ బహుమతి యొక్క ప్రతిష్ట కొంతవరకు బహుమతి విజేతల ఎంపికకు వెళ్ళే గణనీయమైన పరిశోధన నుండి వచ్చింది. విజేతలను అక్టోబర్ మరియు నవంబర్‌లో ప్రకటించినప్పటికీ, ఎంపిక ప్రక్రియ మునుపటి సంవత్సరం శరదృతువు ప్రారంభంలో ప్రారంభమవుతుంది, బహుమతుల కోసం అభ్యర్థులను ప్రతిపాదించడానికి లేదా నామినేట్ చేయడానికి బహుమతి-ప్రదానం చేసే సంస్థలు 6,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులను ఆహ్వానిస్తాయి. ప్రతి బహుమతికి దాదాపు 1,000 మంది వ్యక్తులు నామినేషన్లు ఉంటాయి. నామినీల సంఖ్య సాధారణంగా 100 నుండి 250 వరకు ఉంటుంది. నామినేట్ చేసిన వారిలో నోబెల్ గ్రహీతలు, బహుమతి ప్రదాన సంస్థల సభ్యులు ఉంటారు; ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ మరియు ఫిజియాలజీ లేదా మెడిసిన్ రంగాలలో చురుకుగా ఉన్న పండితులు, వివిధ అధికారులు,  విశ్వవిద్యాలయాల  సభ్యులు  అకాడమీలు ప్రతివాదులు తమ అర్హతను వివరించే వ్రాతపూర్వక ప్రతిపాదనను  అవార్డు సంవత్సరంలో జనవరి 31 లేదా అంతకు ముందు నోబెల్ కమిటీలకు సమర్పించాలి.

ఫిబ్రవరి 1న ఆరు నోబెల్ కమిటీలు-ప్రతి బహుమతి కేటగిరీకి ఒకటి-అందుకున్న నామినేషన్లపై తమ పనిని ప్రారంభిస్తాయి. ప్రతి నామినీ సహకారం యొక్క వాస్తవికత మరియు ప్రాముఖ్యతను నిర్ణయించడంలో కమిటీలకు సహాయం చేయడానికి ప్రక్రియ సమయంలో బయటి నిపుణులను తరచుగా సంప్రదిస్తుంటారు. సెప్టెంబరు మరియు అక్టోబరు ప్రారంభంలో నోబెల్ కమిటీలు తమ పనిని పూర్తి చేసి  రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మరియు ఇతర బహుమతి ప్రదాన సంస్థలకు తమ సిఫార్సులను సమర్పించుతాయి.  అవార్డర్‌ల తుది నిర్ణయం నవంబర్ 15లోపు తీసుకోవాలి. 

శాంతి బహుమతిని సంస్ధలకు మిగిలిన 5 బహుమతులు వ్యక్తులకు   ఇవ్వడం జరుగుతుంది, ఇవి సంస్థకు కూడా ప్రదానం చేయవచ్చు. అవార్డు ఒక్కో కేటగరీ లో గరిష్ఠంగా ముగ్గురుకి ఇస్తారు. అవార్డు కి నామినేట్ అయ్యేసరికి సదరు వ్యక్తి జీవిస్తూ ఉండాలి. అక్టోబర్ లో అవార్డు విజేతలును ప్రకటించి, డిసెంబర్ 10 నాడు అవార్డులును ప్రధానం చేస్తారు.

అవార్డులుకు మనీ ఎవరు ఇస్తారు ?

శాంతి బహుమతికి ఎకానమీ బ్యాంకు అఫ్ స్వీడన్ (రిస్క్ బ్యాంకు) మిగతా కేటగిరి అవార్డులు లకు నోబెల్ ఏర్పాటు చేసిన ఫండ్ నుండి ఇస్తారు .

ఆల్‌ఫ్రెడ్ నోబెల్ గురించి... 

ఇమాన్యువెల్ నోబెల్  మరియు ఆండ్రియాట్ ఆల్సెల్ నోబెల్ ల మూడవ సంతానం. ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21, 1833 లోజన్మించాడు. ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ప్రముఖ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో  1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. 

ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు. కృత్రిమ మూలకము నోబెలియం  ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.


2021 సంవత్సరంలో నోబెల్ బహుమతి గ్రహీతలెవ్వరు ? 

✒ నోబెల్ శాంతి పురస్కారం జర్నలిస్టులు  రెస్సా, దిమిత్రీ మురాటోవ్  ఎంపికయ్యారు.

✒ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి సుకురో మనాబో, క్లాస్‌ హాసిల్‌మన్‌, జార్జియో పారిసీలు ముగ్గురు సంయుక్తంగా పురస్కారానికి  ఎంపికయ్యారు.

✒ సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి కి  అబ్దుల్‌రాజాక్ గుర్నా ఎంపికయ్యారు.

✒ వైద్య శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని  డేవిడ్‌ జూలియస్‌ (David Julius), ఆర్డెమ్‌ పటాపౌటియాన్‌  (Ardem Patapoutian) అనే అమెరికన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అందుకోనున్నారు.

✒ ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతులు అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు డేవిడ్‌ కార్డ్‌, జాషువా డి. ఆంగ్రిస్ట్‌, గైడో డబ్ల్యూ. ఇంబెన్స్‌లకు సంయుక్తంగా ఎంపికయ్యారు.

✒ రసాయినిక శాస్త్రంలో జర్మనీకి చెందిన రసాయన శాస్త్రవేత్త బెంజమిన్ లిస్ట్, బ్రిటన్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త డేవిడ్ మెక్ మిలాన్ సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. 

నోబెల్‌ బహుమతి ఎక్కడ, ఎవరు, ఎంత ప్రధానం చేస్తారు ?

నోబెల్‌ బహుమతి  ప్రదానోత్సవం స్టాక్‌హోమ్‌లోని సమావేశ మందిరంలో జరుగుతుంది.

స్వీడన్‌ రాజు చేత ప్రతీ బహుమతి గ్రహీతకు ఒక యోగ్యతాపత్రము, బంగారు పతకము, బహుమతి ధనము, నిర్థారక పత్రాలనూ బహుకరిస్తారు. 

 నోబెల్‌ బహుమతికై ఇచ్చే ధనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. నోబెల్‌, తాను స్థాపించిన పరిశ్రమలపై వచ్చే ఆదాయాన్ని కూడా కొంత భాగం దీనికి మళ్ళించినందువల్ల ఈ మొత్తం సంవత్సరం, సంవత్సరం మారుతూ వుంటుంది. దీని విలువ భారతీయ విలువ ప్రకారము 300 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా.

 నొబెల్ పతకంలో బంగారం ఎంత ఉంటుంది ?

1980కి ముందు చేసిన అన్ని పతకాలు 23 క్యారెట్ల బంగారంతో చేయబడేవి .1980 నుండి 24 క్యారెట్ల బంగారంతో పూసిన 18 క్యారెట్ల ఆకుపచ్చ బంగారంతో తయారవుతున్నాయి . ప్రతి పతకం యొక్క బరువు బంగారం విలువను బట్టి మారుతుంది, అయితే ప్రతి పతకానికి సగటున 175 గ్రాములు ఉంటుంది. వ్యాసం 66 మిల్లీమీటర్లు (2.6 అంగుళాలు) మరియు మందం 5.2 మిల్లీమీటర్లు (0.20 అంగుళాలు) మరియు 2.4 మిల్లీమీటర్లు (0.094 అంగుళాలు) మధ్య మారుతూ ఉంటుంది.

ఇప్పటి వరకు ఈ అవార్డులు పొందిన భారతీయులెవరు ?

రవీంద్రనాధ్ ఠాగూర్ 1913లో 

సర్ సి వి రామన్  1930

హర్‌గోవింద్‌ ఖొరానా  1968

మదర్‌ థెరిస్సా  1979

సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ 1983

అమర్త్యసేన్‌ 1998

విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌ 2001 

వెంకట్రామన్ రామకృష్ణన్ 2009

కైలాస్ సత్యార్థి 2014.

Post a Comment

0 Comments