ఇంటర్‌లోనే 3 కోట్ల స్కాలర్‌షిప్ - తమిళనాడు బాలిక అరుదైన ఘనత : చికాగో వర్సిటీలో చదివేందుకు అర్హత
కేవలం ఇంటర్ విద్యార్హతతో ఓ అమ్మాయి 3 కోట్ల స్కాలర్‌షిప్ సాధించింది. అమెరికాలోని చికాగో యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు ఎంపికైంది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన శ్వేగ ఈ ఘనత సాధించింది. కాశిపాళయానికి స్వామినాథన్, సుకన్య దంపతులకు కుమార్తె శ్వేగ (17), కుమారుడు అచ్యుతన్ ఉన్నారు. శ్వేగఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసింది. ‘డెక్స్‌టెరిటీ గ్లోబల్’ సంస్థ ద్వారా ‘లీడర్‌షిప్ డెవల్‌పమెంట్, కెరీర్ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్’లో శిక్షణ పొందింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ప్రపంచ విద్యావకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తోంది. చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే శ్వేగ ప్రతిభను ఈ సంస్థ గుర్తించింది. ఈ సంస్థ ద్వారా శిక్షణ పొంది చికాగో యూనివర్సిటీలో డిగ్రీ చదివేందుకు ఎంపికైంది. ఆమెకు రూ.3 కోట్లు ఉపకారవేతనం కూడా ఇవ్వనున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. మూడేళ్ల నుంచే గ్లోబల్ సంస్థలో శిక్షణ పొందుతున్నానని శ్వేగ చెప్పింది. ఆన్‌లైన్‌లో పరీక్ష రాసి, చికాగో యూనివర్సిటీలో చదివేందుకు అర్హత సాధించానని తెలిపింది.
0 Comments