‘ఆధార్ లింక్’పై ఆదేశాలు రాలేదు: ఎస్‌ఈసీ
ఓటర్లు తమ ఆధార్‌ను ఓటరు గుర్తింపు కార్డుతో(ఎపిక్) లింక్ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ స్పష్టం చేశారు. ఓటర్లు తమ ఎపిక్‌తో ఆధార్‌ను లింక్ చేయాలని అభ్యర్థిస్తూ లింకులు, ఎస్‌ఎంఎ్‌సలు వస్తున్నట్లు 1950 కాల్ సెంటర్‌కు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇటువంటి నకిలీ సందేశాలకు ప్రజలెవరు స్పందించవద్దని విజయానంద్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు.
0 Comments