దిల్లీ ఎయిమ్స్ ఐఎన్‌ఐ పరీక్షలో తెలంగాణ విద్యార్థి హర్షంత్‌కు తొలి ర్యాంకు
దిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో అఖిల భారత స్థాయిలో ఈ నెల 7న నిర్వహించిన ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్’(ఐఎన్‌ఐ) పరీక్షలో కార్డియోథొరాసిక్ అండ్ వ్యాస్కులర్ సర్జరీ విభాగంలో తెలంగాణకు చెందిన చావా హర్షంత్ సాయిరాం తొలి ర్యాంకు సాధించారు. ఈ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు దిల్లీ ఎయిమ్స్, పీజీఐ చండీగఢ్, జిప్‌మర్ పుదుచ్చేరి తదితర వైద్య సంస్థల్లో పీజీ సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఖమ్మం జిల్లాకు చెందిన హర్షంత్ ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, గాంధీ వైద్య కళాశాలలో ఎంఎస్(జనరల్ సర్జరీ) పూర్తి చేశారు.
0 Comments