‘ఆ నివేదిక తప్పుల తడక’ _ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఛైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి
పీఆర్సీపై అధికారులు ఇచ్చిన నివేదిక అంతా తప్పుల తడకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఛైర్మన్ కాకర్ల వెంటరామిరెడ్డి అన్నారు. జిల్లాకు వచ్చిన ఆయన ఆదివారం జిల్లా ప్రజాపరిషత్ ఆవరణలోని డీపీఆర్సీ సమావేశ మందిరంలో సంఘ రాష్ట్ర కోఛైర్మన్ జమాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 34 శాతం ఫిట్‌మెంట్‌తో 11వ పీఆర్సీ ఇవ్వాలన్నారు. అధికారులు ఇచ్చిన కాకిలెక్కల నివేదికను పక్కన పెట్టాలన్నారు. డీఏలను పీఆర్సీతోపాటు ప్రకటించాలని కోరారు. జమాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ లెక్చరర్లకు, మోడల్‌స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు ఇప్పించామన్నారు. ఖజాన శాఖ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ.. తమ సంఘం ఉద్యోగుల పక్షాన నిలిచి రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంగళరెడ్డి, పాలిటెక్నిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, మోడల్‌స్కూల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకరరెడ్డి, జూనియర్ లెక్చరర్స్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, గెస్ట్ టీచర్ల సంఘ నాయకులు గురురత్నం, తదితరులు పాల్గొన్నారు.
0 Comments