GET MORE DETAILS

ప్రతిభను వెలికితీయడమే ఎడ్యుకేషన్‌ ఎపిఫణి లక్ష్యం _ కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు

 ప్రతిభను వెలికితీయడమే ఎడ్యుకేషన్‌ ఎపిఫణి లక్ష్యం _ కరపత్రాలు ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు



ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఎడ్యుకేషన్‌ ఎపిఫణి సంస్థ కృషి చేస్తుందని పరీక్షల నిర్వహణ కన్వీనర్‌ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అన్నారు. వచ్చే సంవత్సరంలో నిర్వహించబోయే పోటీ పరీక్షల బ్రోచర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ప్రకాశంతో పాటు... చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలకు పోటీ పరీక్షలను విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో విద్యార్థుల పారితోషికాలకు రూ.2.28 లక్షలు, విద్యావిషయక సామగ్రి కోసం రూ.10.28 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. పది, ఏడో తరగతి వారికి... ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 31 ప్రిలిమినరీ, ఫిబ్రవరి 10న ప్రధాన పరీక్ష నిర్వహిస్తామన్నారు. అజిత్‌కుమార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మమ్మ ఛారిటబుల్‌ ట్రస్ట్‌, దిడ్ల స్వామి, కె.త్రినాథరెడ్డి ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వడ్డవల్లి వీరనారాయణ, ఎన్‌.రాఘవ, శ్రీధర్‌, పద్మావతి పాల్గొన్నారు.

Post a Comment

0 Comments