GET MORE DETAILS

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం : : ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి

 విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం : : ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి




శిక్షణలో ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలను పాఠశా లల్లో అమలు చేసి విద్యార్థులు, పాఠశాలల భద్రతకు తోడ్ప డాలని ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ బి. ప్రతాపరెడ్డి పేర్కొన్నారు. గత ఐదు రోజులుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్క రాష్ట్రవిద్యా పరిశోధన సంస్థ సంయుక్తంగా గుంటూరు జిల్లా బాపట్ల ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ కేంద్రంలో 'విద్యార్థి కేంద్రీకృత విపత్తు ప్రమాద తగ్గింపు' శిక్షణా కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆశిస్తున్నట్లు ‘నేటి బాలలే రేపటి ప్రపంచ పౌరులుగా' గుర్తించేందుకు వారి మానసికఔన్నత్నాన్ని, మానసికస్థిరత్వాన్ని పెంపొందించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. ఈ శిక్షణకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వివిధ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల నుంచి 114 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో భాగం గా విపత్తు నిర్వహణ, విద్యార్థి కేంద్రీకృత విపత్తు తగ్గింపు, బాలల హక్కులు, విపత్తుల సమయంలో బాలల హక్కుల రక్షణ, వాతావరణ మార్పులలో పిల్లల సంర క్షణ, పాఠశాల భద్రత, బాలల మానసిక ఆరోగ్యంపై విపత్తుల ప్రభావం, పిల్లల్లో సామర్థ్యాభివృద్ధి, విద్యార్థి కేంద్రీకృత విపత్తు నిర్వహణను ప్రధాన స్రవంతిలో కల పడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో భాగంగా ఉపాధ్యాయులను బాపట్ల సమీపాన కొండబొట్లవారి పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లి వారు నేర్చుకున్న విషయాలను ఆ పాఠశాలలో పరిశీలించి చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ జి.కె. పద్మజ రిసోర్సు పర్సన్లను మెమోంటోతో సత్కరించారు. సెంటర్ ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ కుమార్ రాకా, ప్రాజెక్టు అసోసియేట్స్ డాక్టర్ బాలు, డాక్టర్ రంజన్ కుమార్, జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ షేక్ నాజియా రిసోర్సు పర్సన్లుగా వ్యవహరించారు.

Post a Comment

0 Comments