GET MORE DETAILS

రేపు ఆకాశంలో అద్భుతం...ఆకుపచ్చ తోక చుక్క దర్శనం

 రేపు ఆకాశంలో అద్భుతం...ఆకుపచ్చ తోక చుక్క దర్శనం



తోక చుక్క ఒకటి దర్శనం ఇవ్వనుంది. ఇది గ్రీ న్ కలర్లో ఉండటం విశేషం. లియోనార్డ్ అనే ఈ తోకచుక్క భూమికి ఎంతో దగ్గరగా రానుంది. డిసెంబర్ నెలంతా కనిపిస్తూనే ఉంటుంది. కానీ స్పష్టం గా మాత్రం రేపు దర్శనం ఇస్తుంది. అత్యంత కాంతి వంతమైన తోక చుక్క ఇదే. 2021 జనవరిలో గురు గ్రహం దగ్గర్లో ఉన్నప్పుడు దీన్ని కనిపెట్టారు. త్వరలో సూర్యున్ని చేరుకుని, ఓ చుట్టు చుట్టి, తిరిగి తన గెలాక్సీ వైపు వెళ్లిపోతుంది. సాధారణంగా తోక చుక్కలు పసుపు రంగులో కనిపి స్తాయి. ఇది మాత్రం ఆకుపచ్చగా దర్శనం ఇవ్వనుంది. ఇలాంటి గ్రీన్ కలర్ తోక చుక్క భూమికి దగ్గరగా రావడంతో 70వేల సంవత్సరాల్లో ఇదే తొలిసారి. 2022, జనవరి 3న ఇది సూర్యుడి దగ్గరకు వెళ్తుంది. దీన్ని చూడాలంటే... ఆదివారం సూ ర్యోదయం కాకముందే.. ఆకాశంలో తూర్పు ఈశాన్య దిక్కువైపున.. చూడాలి. బైనక్యులర్తో తేలిగ్గా గుర్తుపట్టొచ్చు. అప్పుడు మిస్ అయితే.. రోజూ ఉదయం సూర్యోదయానికి 2 గంటల ముందు ఇది తూర్పు దిక్కులో కనిపిస్తుంది.

Post a Comment

0 Comments