GET MORE DETAILS

టీకా నిబంధనలు పాటించకపోతే ఇంటికే - ఉద్యోగులకు గూగుల్‌ హెచ్చరిక

 టీకా నిబంధనలు పాటించకపోతే ఇంటికే - ఉద్యోగులకు గూగుల్‌ హెచ్చరిక



కోవిడ్‌19 వ్యాకినేషన్‌ నిబంధనలు పాటించకపోతే జీతం కోల్పోవడంతో పాటు చివరకి ఉద్యోగం నుంచి కూడా తొలగించే విషయాన్ని పరిశీలించాల్సివుంటుందని గూగుల్‌ హెచ్చరించింది. అల్ఫాబెట్‌లో భాగంగా ఉన్న గూగుల్‌ ఈ మేరకు జారీ చేసిన సంస్థాగత సర్క్యులర్లను ఉటంకిస్తూ సిఎన్‌బిసి వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. డిసెంబర్‌ 3 లోగా ఉద్యోగులు తమ వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను వెల్లడించడం, రుజువులు చూపిస్తూ డాక్యుమెంటేషన్‌ అప్‌లోడ్‌ చేయాలని నిర్దేశించింది. ఆరోగ్యరీత్యా లేదా మతపరమైన సంప్రదాయాల రీత్యా ఏవైనా అవరోధాలుంటే ఆ వివరాలకు సంబంధిచిన పత్రాలను జత చేసి మినహాయింపు కోరాలని సూచించింది. వచ్చే జనవరి 18 నాటికి వ్యాక్సినేషన్‌ నిబంధనలు పాటించని ఉద్యోగులను నెల పాటు సెలవుకు పంపుతామని హెచ్చరించింది. ఆ తరువాత కూడా వైఖరి మార్చుకోకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. సిఎన్‌బిసి కథనంపై స్పందించేందుకు గూగుల్‌ నిరాకరించింది.

Post a Comment

0 Comments