GET MORE DETAILS

ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తాం. కోత విధించం : సజ్జల

ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తాం. కోత విధించం : సజ్జల
ఉద్యోగ సంఘాలతో దాదాపు అన్ని అంశాలపై చర్చించామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఫిట్‌మెంట్, హెచ్ఆర్ఏపై ప్రధానంగా చర్చించామని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఉద్యోగ సంఘాలకు వివరించామన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పూర్తి నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. గురువారం మరోసారి చర్చలు జరుపుతామన్నారు. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆందోళనలు విరమించాలని ఉద్యోగ సంఘాలను కోరామని చెప్పారు. ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తామని.. కోత విధించమన్నారు. రెండ్రోజులు ఓపిక పడితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని సజ్జల పేర్కొన్నారు

Post a Comment

0 Comments