GET MORE DETAILS

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య భారత ప్రధాన న్యామూర్తి దృష్టికి

 ఉద్దానం  కిడ్నీ  బాధితుల సమస్య  భారత ప్రధాన న్యామూర్తి దృష్టికి ఉద్దానం అనగానే ఒకప్పుడు గుర్తుకు వచ్చేవి పచ్చని కొబ్బరి తోటలు, జీడి తోటలు, పనస పంటలు, ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ ప్రాంతాన్ని మినీ కేరళ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాని కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న సమస్య  కిడ్నీ వ్యాధులు . ఉద్దానం ప్రాంతంలో అనేక వేల మంది ప్రాణాలను కోల్పోవడానికి కారణమైన  కిడ్నీ వ్యాధులు ,  ప్రపంచవ్యాప్తంగా భారతదేశం, శ్రీలంక, మధ్య మరియు లాటిన్ అమెరికాలలో పేద మరియు గ్రామీణ రైతులను ఈ  వ్యాధి కబళించడం మన అందరికి  తెలిసిన విషయమే. అయితే ఆ రెండు దేశాలలో సమగ్రమైన పరిశోధన జరుగుతుందని  మన ఉద్దానములో ఇప్పటివరకు  అటువంటి  పరిశోధన ఇక్కడ ప్రభుత్వాలు చేపట్టకపోవడం బాధాకరమని  డాక్టర్ దుర్గా  రావు  అన్నారు . ఇంతకుముందు  జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్లి కొంతవరకు  బాధితులకు  ఉపశమనం  కలిగించారు.  నేడు  చివర ప్రయత్నముగా  విజయవాడలో భారత  ప్రధాన న్యాయమూర్తి  ఎన్ . వి  రమణని కలిసి కేంద్ర ప్రభుత్వానికి  ఆదేశించి  సమగ్రమైన  పరిశోధన జరపమని  ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయమని కోరారు.  

మంత్రుల టాస్క్ ఫోర్స్ వేయండి :

  శ్రీలంకలో కిడ్నీ సమస్యను పర్యవేక్షించడానికి  మంత్రులతో కూడిన కమిటీ వేశారని  ఆ తరువాత  దేశాధ్యక్షుని పేరుతో ప్రెసిడెన్షియల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసి  ప్రపంచ ఆరోగ్య సంస్థ తో అంతర్జాతీయ మరియు జాతీయ నిపుణాల్తో కలిసి శాస్త్రీయ పరిశోధనలు చేసి వ్యాధికి గల ప్రాధమిక కారణాలు కనుగొన్నారని   ఆ తరువాత  శ్రీలంక లో  వ్యాధి  సంభవించకుండా నిరోధించడం, చికిత్సకు హామీ ఇవ్వడం మరియు సమన్వయ ప్రక్రియ ద్వారా ప్రభావితమైన వారి సంక్షేమాన్ని  చూసారని  అయన తెలిపారు.ఉద్దానములో కూడా  సికెడి సమస్యను పరిష్కరించడానికి  మినిస్టీరియల్ టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసి పరిశోధన  చేయాలనీ  విన్నవించారు . ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని  ఈ విషయంలో మిమ్మల్ని కోరుతున్నామని చెప్పారు .

 జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2017 జనవరి లో జనసేన పార్టీ అధ్యక్షుడు  ఇచ్ఛాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖీ జరిపటం వలన ఉద్దానం నెఫ్రోపతి  ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిందని పేర్కొన్నారు . ఉద్దానం కిడ్నీ వ్యాదుల  పైన  జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో  అప్పటి ముఖ్యమంత్రి  చంద్ర బాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారని . ముఖ్యమంత్రి స్పందించి డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, డయాలసిస్ రోగులకు ఉచిత మందులు,  పేషెంట్లకు పింఛన్ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టార గుర్తుచేశారు. ఆ సమయంలో 1.25,000 మందికి పైగా పరీక్షలు చేసారని  మరియు దాదాపు 13,500 కొత్త కేసులు గుర్తించారని తెలియజేసారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో సమగ్ర పరిశోధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) సహకారంతో శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధుల పరిశోధనా సంస్థను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాలో భాగంగా మూడేళ్లకు రూ.15 కోట్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని . రాజకీయ కారణాలతో ఇంతవరకు నిధులు విడుదల కాలేదు.ఆ ప్రాజెక్ట్ అంతటితో ఆగిపోయినదని విచారం వ్యక్తం చేసారు  . 2017లో మిషన్ ఉద్దానం ఏర్పాటుచేసి        డయాలసిస్ రోగులకు ఉచిత రవాణా సౌకర్యం , ఉచిత మందుల సరఫరాతో  వైద్య శిబిరాలు, వాటర్ ప్లాంట్లు నిర్మించడం చేసామని, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి దాతృత్వ కార్యక్రమాలతో మిషన్ ఉద్దానం ఇప్పుడు ఉద్దానం ప్రాంతంలో భారీ ప్రభావాన్ని సృష్టించిందని .  మిషన్ ఉద్దానం బృందం ఉచిత మందుల పంపిణీని తెలుసుకొన్న  చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం  రూ. 10 కోట్లు బడ్జెట్ తో.ఆ  కార్యక్రమాన్ని అమలు చేసారని తెలిపారు . 

కిడ్నీ బాధితులకు న్యాయం చేయండి :

ఉద్దానం ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి చాల దారుణంగా ఉందని, రోజు రోజుకు కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉందని, చాలామంది ప్రాణాలు కోల్పో పోతున్నారన్న విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నానని. భారత దేశ సర్వోన్నత న్యాయస్థాన అధిపతిగా   జోక్యం చేసుకుని, మొత్తం సమస్యను సమీక్షించి, మా  ఉద్దానం ప్రాంత కన్నీటి గాధలు తుడవాలని, కిడ్నీ బాధితులకు న్యాయం జరిగేలా భారత ప్రభుత్వానికి ఆదేశించాలని  డాక్టర్ దుర్గా రావు కోరారు .

Post a Comment

0 Comments