ఒమిక్రాన్‌కు ఆనందయ్య చెక్. 5రకాల మందు పంపిణీ - పూర్తి వివరాలివే...
ఒమిక్రాన్ ప్రపంచ మొత్తాన్ని వణికిస్తోంది.ఈ కేసుల సంఖ్య రోజు రోజు పెరిగిపోతున్నాయి. కొన్ని దేశాల్లో వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.భారత్‌లో కూడా 400కుపైగా కేసులు వచ్చాయి.ఈసమయంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆయుర్వేద వైద్య నిపుణుడు బొనిగి ఆనందయ్య ఒమిక్రాన్‌కు తన దగ్గర మందు ఉందని ప్రకటించారు.
ఒమిక్రాన్ మందు తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.ఒమిక్రాన్ సోకకుండా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ సిద్ధం చేశారు.
దాదాపు 22-రకాల దినుసులతో 5-రకాల మందులు తయారు చేసినట్లు తెలిపారు. ఒమిక్రాన్ రాకుండా ముందు జాగ్రత్తగా తీసుకునే మందు తయారుచేశామని.. ఒకేరోజు రెండు పూటలా ఇది తీసుకుంటే చాలన్నారు.ఈ మందుల తయారీకి కోర్టు అనుమతి కూడా ఉందని చెప్పడం కొస మెరుపు.తాను తయారుచేసిన ఒమిక్రాన్ మందు తీసుకునేవారు 15-రోజుల పాటు మాంసం & మద్యం తీసుకోకూడదన్నారు.
ఒకవేళ ఎవరైనా కరోనా-ఒమిక్రాన్‌తో బాధపడుతుంటే మందు కోసం నేరుగా సంప్రదించొచ్చని ఆనందయ్య తెలిపారు. ఎవరినైనా పంపించినా ఈ మందిస్తానని ప్రకటించారు.ప్రస్తుతం ఈ మందును బంధువులు,మిత్రుల ద్వారా ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న విదేశాలకు ఎక్కువగా పంపిస్తున్నట్టు తెలిపారు.ఈ మందును ఏడాదిపాటు నిల్వఉంటుందని త్వరలోనే బాటిల్స్ రూపంలోఅందుబాటు లోకి తెస్తామంటున్నారు ఆనందయ్య.
0 Comments