GET MORE DETAILS

కార్తీక నది స్నానం చేయలేకపోయారా ? బాధవద్దు.

కార్తీక నది స్నానం చేయలేకపోయారా ? బాధవద్దు.



కార్తీక నది స్నానానికి చివరి అవకాశం ది. డిసెంబర్ 4 2021న. శనివారం రోజు సోమవతి అమావాస్య, చాలా విశేషం.

 అమావాస్య తిథి శనివారం రోజున రావడం అరుదు. అందునా కార్తీక మాసం. ఒక ఉసిరి కాయ/పండు, ఒక తులసిదళం నీటిలో వేసి సూర్యోదయానికి కనీసం 15 ని.లు ముందే శ్రీహరి నామస్మరణతో,  నమఃశివాయ అని స్మరిస్తూ, సప్తనదీ శ్లోకం తెలిస్తే పఠిస్తూ లేదా గంగ గంగ గంగ (3 సార్లు) అని స్నానమాచరించాలి. 

వెంటనే దీపారాథన చేయాలి. ఇలా చేస్తే సర్వతీర్థాలలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుందని, ఇది శాస్త్రపురాణ వచనమని శ్రీరామపాద చెప్పారు.

ఇక సోమవతి అమావాస్య రోజు పలురకాల దోషములు-దుఃఖములు-పాపములు నివృత్తిచేసుకోవడానికి మంచి అవకాశమని, ఈ రోజున రావి వృక్షానికి 108 సార్లు ప్రదక్షిణలు చేయడం, అర్హులైన వారు విధిగా పితృతర్పణలు చేయడం ఎంతో పుణ్యదాయకము.


 కార్తీక దామోదరాయ నమః ! ఓం నమః శివాయ !

Post a Comment

0 Comments