GET MORE DETAILS

ఏపీపీఎస్‌సీ ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌గా ఏవీ రమణారెడ్డి నియామకం

   ఏపీపీఎస్‌సీ ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌గా ఏవీ రమణారెడ్డి నియామకం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఇన్‌ఛార్జ్‌ ఛైర్మన్‌గా ఏవీ రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 24, 2020 నుంచి ఏపీ రమణారెడ్డి ఏపీపీఎస్‌సీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌ ఉదయభాస్కర్ పదవీ విరమణ చేయడంతో రమణారెడ్డికి ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments