GET MORE DETAILS

చేపలు తలకిందులవుతాయి ఎందుకు ?

చేపలు తలకిందులవుతాయి ఎందుకు ?



ఏ ప్రాణి చనిపోయిన తర్వాతైనా దాని శరీరం నిండా వాయువులు ఉత్పన్నమవుతాయి. చేపల్లో కూడా ఇలాగే జరుగుతుంది. తేలికైన ఈ వాయువుల కారణంగానే చనిపోయిన చేపలు నీటిపైన తేలుతాయి. వాయువులు ముఖ్యంగా చేపల కిందివైపు ఉండే ఉదరభాగంలో ఉత్పన్నమవుతాయి. ఫలితంగా ఉదరభాగం ఉత్ల్పవన (buoynacy) ప్రభావానికి గురవుతుంది. చేపల గరిమనాభి (centre of gravity) ఉదర భాగంలో కేంద్రీకరించి ఉండడంతో ఆ భాగం నీటి ఉపరితలానికి చేరుకుంటుంది. అందువల్లనే చనిపోయిన చేప తలకిందులై వెల్లకిలా తేలుతుంది. తర్వాత కొంత కాలానికి చనిపోయిన చేప విఘటనం (decay) చెంది దాని లోని వాయువులన్నీ విడుదలవడంతో అది నీటిలో మునిగిపోతుంది.

Post a Comment

0 Comments