GET MORE DETAILS

"ఎలిఫెంట్ మెమరీ" అంటే ఏమిటో తెలుసా...?

 "ఎలిఫెంట్ మెమరీ" అంటే ఏమిటో తెలుసా...? 



మానవ భావోద్వేగాలను కనిపెట్టే గొప్ప "మనసు" గల జంతువు ఏనుగు. ఏనుగు అనగానే మానవ మస్థిష్కము లో భారీ ఆకారం కనబడు తుంది! మనం సర్కస్ లో ఏనుగులను చూసి ఉన్నాము. వాటి హవభా వాలు పాత జనరేషన్ కు గొప్ప పండుగ లా ఉండేవి. అవి తొండం నిండా నీళ్లు పీల్చుకొని వీపు మీద పోసుకునే అద్భుత దృశ్యాలు మనకు తెలుసు. సర్కస్ కనుమరుగయ్యే సరికి ఈ నాటి జనరేషన్ యూ ట్యూబ్ లో ఏనుగుల విన్యాసాలు చూస్తున్నారు. జంతువుల్లో తెలివైన జంతువు కుక్క అంటారు. కానీ జంతు శాస్త్ర వేత్తలు ఎనుగుకు మెమరీ మైండ్ ఎక్కువ అని నిర్ధారించారు. అంటే మనిషి కన్నా కూడా ఏనుగుకు జ్ఞాపక శక్తి ఎక్కువ. అందుకే ఎలిఫెంట్ మెమరీ అంటారు. నేను శ్రీరంగం వెళ్లి నప్పుడు మావటి ఏనుగు చేత ఆశీర్వాదం ఇప్పించే వారు. రూపాయి కైన్ మావటికి ఇస్తే ఆశీర్వాదం ఇవ్వాలనే సైగ చేసేవారు. తొండం తో తలపై ఏనుగు ఆశీర్వాదం ఇచ్చేది. కొంటెగా ఒక సారి మావటికి డబ్బు చేతిలో పెట్టినట్లు నటించి ఆశీర్వాదం కోసం వేచి చూసాను. ఓరకంటితో నన్ను చూసి నవ్వుతున్నట్టు ఏనుగు ఫేస్ పెట్టింది. ఎంతకీ తొండం పైకి లేవడం లేదు. తిరిగి రూపాయి కాయిన్ పెట్టిన కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు. ఐదు రూపాయల కాయిన్ పెడితే అప్పుడు తల పై తొండం ఒక్కటిచ్చి నాతో పెట్టుకోకు. అన్నట్టు చూసింది. మావటి ఆటలు గా కొట్టి పడేసాను అప్పుడు. నిన్న ఏదో పుస్తకం చదువుతుంటే ఎలిఫెంట్ మెమరీ గురించి చదివాను. ఇక వెంటనే ఏనుగుల మీద రీసెర్చి మొదలయింది. శ్రీరంగం "ఏనుగు మాట్లాడుతుందని" ఒక ఫారెస్ట్ అధికారి కనిపెట్టారు. ఆయన పేరు. సుశాంత్ నంద మావటి తో ఏనుగు ముచ్చటించిన దృశ్యాలు ఆయన సెల్ లో బంధించి సోషల్ మీడియా లో పెట్టారు...నిజంగా ఇదీ వింతే. నిజానికి మావటి చిన్న బెత్తం చేతిలో పట్టుకొని విదిలిస్తే అంత పెద్ద ఏనుగు చెవులు రిక్కిస్తు వింటుంది. మావటి దాని మాట పట్టించుకోక పోతే  తొండం తో విసిరి పారేసిన వార్తలు మనం చూశాము..అసలు "ఎలిఫెంట్ మెమరీ" అంటే ఏమిటీ అని జంతు శాస్త్రం చదివిన నా మిత్రులను అడిగాను. వారు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యం చెందాను. ఏనుగు యొక్క తొండం  బహుళ-సాధనంగా ఉపయోగ పడుతుంది. వాసన, శ్వాస  తొండంతోనే తీసుకుంటుంది. అదే తొండంతో వస్తువులను పట్టుకోవడానికి ఇది చేతి గా కూడా ఉపయోగించబడుతుంది

 ఇది తాను తినే ఆహరాన్ని తొండంతోనే సేకరిస్తుంది. తొండం కొమ్మలను చీల్చేంత బలంగా ఉంటుంది.  ఏనుగులు తమ తొండం లోకి ఒక సారి 14 లీటర్ల నీటిని పీల్చుకోగలవట. ఆ నీటిని తొండం ద్వారా నోటిలోకి ఊది త్రాగగలవు. స్నానం చేసేటప్పుడు ఏనుగు తమ తొండం ద్వారా పిచికారీ చేయడానికి కూడా ఉపయోగిస్తుంది. ఏనుగు తొండం లో 40,000 కండరాలు ఉంటాయట. ఇక మెమరీ విషయానికి వస్తే ఏనుగులు ధ్వని, స్పర్శ, సువాసనను ఉపయోగించి ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయట. ఏనుగు వినికిడి శక్తి అద్భుతమైనది అది ఐదు మైళ్ల దూరం నుండి తొండం ద్వారా తమ సహచరుల వాసన కని పెట్టేస్తాయట. మగ ఆడ ఏనుగు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి విస్తృత శ్రేణి శబ్దాలను ఉపయోగిస్తా యట. ఆడ మగ ఏనుగులు కలిసినప్పుడు మానవులు వినలేని వాటితో సహా మూగభాష తో ప్రేమించు కుంటాయట.

 ఏనుగులు అత్యంత సున్నితమైన "మనసు" గల జంతువులు అని జంతు శాస్త్రజ్ఞులు పరిశోధన చేశారు..  వాటికి దుఃఖం, కరుణ, పరోపకారం తో సై ఆటలు కూడా అడుతాయట. ఒక ఏనుగు మరో ఏనుగు తో మనసు బాధ వ్యక్తీకరించడం కూడా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కొంతకాలంగా దూరంగా ఉన్న మగ ఏనుగు "స్నేహితుడు" తిరిగి గుంపుకు  వచ్చినప్పుడు వాటిని గుర్తు పట్టి తొండం తో ప్రేమ గా నిమురు కుంటాయట. కొన్నిసార్లు వారు తమ తోండాలు చుట్టి 'కౌగిలించుకుంటాయట. ఒక వేళ తమ అడ స్నేహితురాలైన ఏనుగు చనిపోతే మగ ఏనుగు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ కనబడ్డ చెట్లను ధ్వంసం చేయడం కాకుండా ఎదురుగా వచ్చిన మనుషులను కూడా కాళ్ల తో తొక్కి పడేస్తాయట. మనుషులు లాగా వాటికి కూడా మూడ్ భాగ లేకుంటే విరహ తాపం తో మదమెక్కి ప్రవర్తిస్తాయట.

ఇక మహాభారత యుద్ధం లో ఏనుగు అంబారీ ఎక్కి యుద్ధం చేసిన వీరుల కథలు విన్నాము. "గజేంద్ర మోక్షం" గురించి కథలు ఎన్నో ఉన్నాయి. మానవ జీవితంలో వినాయకుడు ఒక ఏనుగు రూపేణ మనం రోజూ పూజించే గొప్ప దేవ దేవుడు. చిన్నప్పుడు ఏనుగమ్మా ఏనుగూ, ఏ వూరెళ్తోందేనుగూ? ఏనుగమ్మా ఏనుగూ... రాముడెక్కిన ఏనుగూ, రాజులెక్కిన ఏనుగూ,  మావూరొచ్చిందేనుగూ, మంచినీళ్లు తాగిందేనుగూ...’’ ఈ పాటను రకరకాలుగా పాడుతూ మోకాళ్లమీద వంగి పడుకొని మనుమల్ని ఆడించని తాతలూ- అవ్వలూ-అమ్మలూ, నాన్నలూ ఉండేవారు. ఇప్పుడు ఊళ్ళో సర్కస్ లు లేవు ఏనుగులు లేవు. జంతు ప్రదర్శన శాలలో  ఏనుగులు చూడడం తప్పా...? '

అంబారీ’ అంటే ఏనుగు మీదే వుంటుంది. దానినే ‘హౌదా’ అంటారు. ఆ ‘హవుదా’ని (డా)అని కూడా అలవాటుగా అంటారు. ఏనుగు మీద ఊరెగడం అంటే గొప్ప ఘన కార్యం చేసినట్టు.  ఏనుగు ఎక్కించడం అంటే మజాకా కాదు. అది గొప్ప సన్మానం. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిని ఏనుగు ఎక్కించారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారినీ ఏనుగు ఎక్కించి ఊరేగించారు. సినిమా నటి సావిత్రిని కూడా ఏనుగు అంబారీలో ఊరేగించారు. గానీ ఇప్పుడు ఏనుగు దేవాలయాల్లో లేదా అడవుల్లో మాత్రం మిగిలి ఉంటుంది.

Post a Comment

0 Comments