క్రిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా...!
సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు.
ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండ కలుగుతుందని భావిస్తారు.
✒ పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది.
✒ అనంతరం ఈ వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా తర్వాత ఈ యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకువచ్చాడు.
✒ ఇలా భూలోకంలో ఉన్న ఈ పారిజాత వృక్షానికి పూసిన పుష్పాలు చెట్టుమీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఏరుకొని స్వామికి సమర్పించాలని చెబుతారు.
✒ అలా కింద పడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి కోయకుండా ఎందుకు రాలిన పుష్పాలని ఏరుకొని పూజ చేయాలి అనే విషయానికి వస్తే.
✒ సాధారణంగా ప్రతి వృక్షం భూమినుంచి ఉద్భవిస్తుంది కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది.
✒ ఇలా స్వర్గం నుంచి భూలోకంలోకి రావడం వల్ల ఈ వృక్షం నుంచి పూసిన పుష్పాలు మొదటిగా భూమిని తాకిన తర్వాత భగవంతుడికి సమర్పించాలని చెబుతారు.
✒ అందుకోసమే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి నేల పై రాలిన పుష్పాలు ఏరుకొని భగవంతుడికి సమర్పించాలి.
✒ ఇక పారిజాత వృక్షం ఏ ఇంటి ఆవరణంలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో సిరిసంపదలకు కొదవుండదని చెప్పవచ్చు.
సర్వేజనా సుఖినోభవంతు
0 Comments