రెండో కొల్హాపూరి గా పిలిచే క్షేత్రం కల్లూరు మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం - కల్లూరు - రాయచూరు - కర్ణాటక
స్థలపురాణం :
రెండో కొల్హాపూరి గా పిలిచే క్షేత్రం కల్లూరు మహాలక్ష్మి అమ్మ వారి దేవాలయం రాయచూరు కి సమీపం లో ఒక బ్రాహ్మణుడు ఇంటిలోనే తల్లి కొలువైంది..నవాబ్ ల కాలం లో లక్ష్మీ కాంత్ ఆచార్య అనే ఒక బ్రహ్మణుడు ప్రతి సంవత్సరము నవరాత్రుల సమయము లో కొల్హాపూరి వెళ్లి అమ్మ వారిని దర్శించుకునే వారు..కానీ ఒక సంవత్సరం వయస్సు పైబడిన మూలన వెళ్లలేక ఇంట్లోని ఉండిపోయి అమ్మ వారిని తలుచుకుంటూ బాధలో ఉన్నారు ..ఆ రాత్రి అమ్మ వారు స్వప్నం లో వచ్చి నువ్వు రాలేదు అని బాధపడొద్దు నేనే ని దగ్గరికి వస్తున్న అని చెప్పింది అంట.
అది అంత విన్న ఆచార్యులు..మరుసటి రోజు లెచి దాని గురుంచి ఆలోచించుకుండా పూజ కార్యక్రమాలు మొదలెట్టాడు .. అంత లో చందనం కర్ర తో ప్రతి నిత్యం వాడే రాయిని రాస్తూ ఉండగా రాయి లో మార్పు లో కనిపించాయి ఆట..కొద్దీ సేపు అలా చూస్తుండగానే అమ్మ వారి దివ్య మంగళ రూపం దర్శనం ఇచ్చింది ఆట..దానితో ఆచార్యుల వారు సంతోషించి అమ్మ వారిని తన స్వగృహం లొనే ప్రతిష్టించి పూజించడం ప్రారంభించాడట..
ఆ మరుసటి సంవత్సరం ఆచార్యుల వారు ఒక గ్రామం గుండా వెళ్తుండగా ఒక పొలం లో వెంకటేశ్వర స్వామి విగ్రహము దొరుకగా దానిని తీసుకొని వచ్చి అమ్మ వారి ప్రక్కనే ప్రతిష్టించారు.అలా అమ్మ వారు ఒక సాదరన గృహం లొనే కొలువై పూజలందుకుంటున్నారు..ఇక్కడ కార్యక్రమలు అన్ని మధ్వ సంప్రదాయ పరంగా జరుగుతాయి.
మంత్రాలయం వెళ్లిన వారు వీలు చూసుకొని తప్పకుండా దర్శించాల్సిన దివ్యమైన లక్ష్మీ క్షేత్రం.
మహాలక్ష్మి అష్టకం
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తు తే || 1 ||
నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 2 ||
సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 3 ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 4 ||
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తు తే || 5 ||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 6 ||
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తు తే || 8 ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్.
ఈ ఆలయం రాయచూరు కి 20km. KSRTC చాలా బస్ లు అందుబాటులో ఉన్నాయి. వసతి సౌకర్యాలు రాయచూరు లో మంచిది.
0 Comments