Ads Area

Booster Dose బూస్టర్ డోస్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

0

 Booster Dose బూస్టర్ డోస్ పై క్లారిటీ ఇచ్చిన కేంద్రం




 ®️ఒమిక్రాన్‌ విజృంభిస్తుండటంతో బూస్టర్‌ డోసుకు సంబంధించిన వివరాలను పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించినట్లు మీడియా తెలిపింది.అవసరమైతే, మూడో డోసు తీసుకోవచ్చని, అయితే రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల అనంతరం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించినట్లు పేర్కొంది. కరోనా కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్‌లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అలాగే భారత్‌ అందిస్తున్న వ్యాక్సిన్‌ ధ్రువపత్రాన్ని 100కు పైగా దేశాలు అంగీకరిస్తున్నాయని వివరించారు. ఆరోగ్య శాఖ సెక్రటరీ, ఐసిఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌, తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఒమిక్రాన్‌, కరోనా సంబంధిత అంశాలను వెల్లడించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area