GET MORE DETAILS

‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్

 ‘ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్‌



మనం దెయ్యాలు గురించి ఎవరైనా చెబుతుంటే వారు చదువుకోలేదేమో! లేక వాళ్లు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అని కొట్టిపారేస్తాం. పైగా మూర్ఖులుగా భావించి కాస్త చిన్నచూపు చూస్తాం. కానీ మంచి ఉన్నతోద్యోగంలో పనిచేస్తున్న వ్యక్తి దెయ్యాల గురించి చెబితే ఒకింత ఆశ్యర్యపోతూ వింటాం. పైగా ఎవరతను అని కచ్చితంగా కుతుహలంగా ఉంటుంది. అచ్చం అలానే ఒక ఐఐటీ ప్రొఫెసర్‌ దెయ్యాల గురించి కొన్ని ఆస్తకికర వ్యాఖ్యలు చేశాడు.

అసలు విషయంలోకెళ్తే... ఐఐటి మండికి కొత్తగా నియమితులైన డైరెక్టర్, ప్రొఫెసర్ లక్ష్మీధర్ బెహెరా దెయ్యాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. పైగా వాటిని తాను  మంత్రాలు, శ్లోకాలు పఠించి దెయ్యాల్ని తరిమికొట్టానంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు దెయ్యాలు గురించి చెబుతూ..1993 నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ సమయంలో చెన్నైలోని తన స్నేహితుడి కుటుంబాన్ని కొన్ని దుష్టాత్మలు ఏడిపించాయని చెప్పాడు.  పైగా తాను అప్పుడు తన స్నేహితుడికి ఇంటికి వెళ్లి 'హరే రామ హరే కృష్ణ' మంత్రాన్ని పఠించడంతో పాటు "భగవద్గీతలోని కొన్ని శ్లోకాలు సాధన చేయడం ప్రారంభించానని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు ఆ దెయ్యాలు తన స్నేహితుడి భార్యని, అతని తండ్రిని పట్టుకున్నాయని, వారు చాలా వింతగా ప్రవర్తించడం కూడా చూశానని చెప్పాడు. ఇలా ఒక ఐఐటీ ప్రోఫెసర్‌ దెయ్యాలు గురించి ఆసక్తి కరంగా చెబుతున్నా వీడియో ఒకటి యూట్యూబ్‌లో "లెర్న్ గీత లైవ్ గీత" పేరుతో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ఆసక్తికరమైన వీడియోగా వైరల్‌ అవుతోంది. అయితే బెహరా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్. పైగా అతను ఐఐటీ ఢిల్లీ నుండి పీహెచ్‌డీ కూడా చేయడమే కాక  రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో పేరుగాంచిన ప్రోఫెసర్‌ కావడం విశేషం.

Post a Comment

0 Comments