రోజు 16 వేల వేతనం... క్యూలో నిలబడితే చాలు.. భారీగా సంపాదన
శీర్షిక చూశారుగా.. భలేగా ఉంది కదూ ఈ ఆఫర్! ఛా.. ఇలాంటి ఉద్యోగాలు, పారితోషికాలు కూడా ఉంటాయా అని అనుకుంటున్నారా..? సందేహం వద్దు.. ఇది నిజంగా నిజం. బ్రిటన్‌కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్(31) ప్రస్తుతం ఇలా గంటల కొద్దీ లైన్లలో నిలబడి రోజుకు సగటున రూ. 16 వేలు(మన కరెన్సీలో చెప్పుకోవాలంటే..) సంపాదిస్తున్నారు. క్యూలో నిలబడి ఏం చేస్తాడు అని అంటారా..? కొత్తగా చేసేదేం ఉండదు.. తన వంతు వచ్చాక.. కౌంటర్‌లో ఏది ఇస్తే అది కొంటాడు. ఆ తరువాత.. ఎవరి కోసమైతే ఇలా లైన్లో నిలబడ్డాడో వారికి తాను కొన్న వస్తువు ఇచ్చేస్తాడు.
ఇదంతా చేసినందుకు వారి నుంచి కొంత మొత్తాన్ని పుచ్చుకుంటారు. క్యూలో గంటల తరబడి నిలబడలేని ధనికులు ఫ్రెడ్డీ సేవలు వినియోగించుకుంటారట. ముఖ్యంగా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు, సినిమా టిక్కెట్ల కోసం వృధ్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు తనను సంప్రదిస్తుంటారని ఫ్రెడ్డీ తెలిపాడు. ఇలా క్యూలో నిలబడి సంపాదించడంతో పాటూ ఫ్రెడ్డీ.. కాల్పనిక నవలలు కూడా రాస్తుంటాడు.
0 Comments