GET MORE DETAILS

ఏపీలో నిరుద్యోగిత రేటు 5.05% - చివరి నాలుగు నెలల్లో నమోదు : ఇండియన్‌ ఎకానమీ సంస్థ వెల్లడి

 ఏపీలో నిరుద్యోగిత రేటు 5.05% - చివరి నాలుగు నెలల్లో నమోదు : ఇండియన్‌ ఎకానమీ సంస్థ వెల్లడి



గతేడాది సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో ఏపీలో 5.05 శాతం నిరుద్యోగిత రేటు నమోదైందని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సంస్థ వెల్లడించింది. గణాంకాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2021లో చివరి నాలుగు నెలల కాలంలో 5.05 శాతం నిరుద్యోగ రేటు నమోదుకాగా, అదే ఏడాదిలో తొలి నాలుగు నెలలు(జనవరి-ఏప్రిల్‌) మాత్రం 4.71 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. ఆ తర్వాత మే నుంచి ఆగస్టు వరకు నిరుద్యోగిత 7.72 శాతం నమోదైంది. 2021 డిసెంబరు చివరి నాటికి మాత్రం 2.2 శాతం మాత్రమే నమోదైనట్టు నివేదిక వివరించింది.  గ్రాడ్యుయేషన్‌, ఆపై విద్యను అభ్యసించిన వారిలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన వారి నిరుద్యోగిత రేటు 33.98ు. 10వ తరగతి, ఇంటర్‌ చదివిన వారిలో నిరుద్యోగిత రేటు 2.84  శాతంగా ఉంది.  వయసుల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా 20-24 మధ్య వయస్కుల నిరుద్యోగిత రే టు 46.82 శాతం ఉండగా.. 15-19 వయసు వారిలో 24.71 శాతం, 25-29 వయసు వారిలో 15.73 శాతం ఉంది.  పట్టణ ప్రాంతంలో నిరుద్యోగిత రేటు 5.4ు ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 4.9 శాతం ఉంది.  పురుషుల్లో 4.9 శాతం మంది నిరుద్యోగులు ఉండగా.. మహిళల్లో 5.6 శాతంగా నమోదైంది.

Post a Comment

0 Comments