Ads Area

నోటిఫికేషన్‌ ద్వారానే భర్తీ మోసం చేసే వ్యక్తులను నమ్మొద్దు : ఆర్టీసీ

0

 నోటిఫికేషన్‌ ద్వారానే భర్తీ మోసం చేసే వ్యక్తులను నమ్మొద్దు : ఆర్టీసీ



 ‘నిరుద్యోగులూ.. తస్మాత్‌ జాగ్రత్త’ అంటూ ఏపీఎ్‌సఆర్టీసీ హెచ్చరించింది. ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేసే వ్యక్తులను నమ్మొద్దని ప్రకటించింది. ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తి నిరుద్యోగులను మోసం చేస్తున్న విష యం వెలుగులోకి వచ్చింది. ఏపీఎ్‌సఆర్టీసీ మదనపల్లి, విజయవాడ పేర్లతో నకిలీ మెయిల్‌ ఐడీలు సృష్టించి నిరుద్యోగుల నుంచి వసూళ్లు చేస్తున్న విషయం బయట పడింది. మదనపల్లి, పలమనేరు డిపోల్లో ఉద్యోగాల భర్తీ అంటూ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు, చైర్మన్‌ మల్లిఖార్జున రెడ్డి పేర్లతోనే డబ్బులకు ఎర వేశాడు. దీంతో ఆర్టీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.

Post a Comment

0 Comments

Top Post Ad

Bottom Post Ad

Ads Area