GET MORE DETAILS

ఒకరోజు వేతనం కట్ - ప్రొబేషన్‌ పోరుపై సర్కారు కన్నెర్ర

 ఒకరోజు వేతనం కట్ - ప్రొబేషన్‌ పోరుపై సర్కారు కన్నెర్ర



 గ్రామ సచివాలయాల ఉద్యోగులకు షాక్‌ వినూత్న రీతిలో నిరసన కొనసాగింపు ప్రొబేషన్‌పై ‘స్పందన’కు ఫిర్యాదుల వెల్లువ.

ప్రొబేషన్‌ కోరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్‌ ప్రభుత్వం పనిష్మెంట్‌ ఇచ్చింది. వారికి ఒకరోజు జీతం కట్‌ చేసింది. దీనిపై బుధవారం ఎక్కడికక్కడ ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్లు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులకు అక్టోబరు 2వ తేదీనాటికే ప్రొబేషన్‌ పూర్తయింది. ఇప్పటికే వారి సర్వీసు క్రమబద్ధీకరణ మూడు నెలలు ఆలస్యమైంది. ప్రొబేషన్‌ కోసం వీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా... ముఖ్యమంత్రి జగన్‌ వీరి నెత్తిన మరో బండ వేశారు. ప్రొబేషన్‌ను ఈ ఏడాది జూలైలో ప్రకటిస్తామని తెలిపారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది మండిపడ్డారు. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనలకు దిగారు. తక్షణం ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేసి... జనవరి నుంచే పేస్కేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వారిని బుజ్జగించారు, బెదిరించారు. చివరికి.. సిబ్బంది అంతా విధులకు హాజరయ్యారు. వీరి సమస్యలపట్ల సానుభూతి చూపాల్సిన ప్రభుత్వం.. మరింత కన్నెర్ర చేసింది. విధులు బహిష్కరించినందుకు శిక్షగా ఒకరోజు వేతనంలో కోత పెట్టింది. ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తే పెరిగే వేతనాలతో నిజమైన పండగ చేసుకుందామని ఉద్యోగులంతా ఎదురుచూశా రు. కానీ, ఇస్తున్న వేతనాల్లోనే ప్రభుత్వం కోత పెట్టడం వారి ముఖాల్లో సంక్రాంతి కాంతిని మాయం చేసింది. మరోవైపు అధికారుల ఒత్తిళ్లతో ప్రత్యక్ష నిరసనలను విరమించిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగు లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు సమర్పిస్తున్నా రు. ప్రభుత్వ లక్ష్యాల కోసం కష్టపడి పని చేస్తున్న తమ న్యాయపరమైన డిమాండ్‌ పరిష్కరించేలా చూడాలని, 22లోగా ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని కోరుతున్నారు.

వెంటనే ప్రొబేషన్‌ ప్రకటించాలి: టీచర్‌ ఎమ్మెల్సీలుగ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు తక్షణం ప్రొబేషన్‌ ప్రకటించాలని టీచర్‌ ఎమ్మెల్సీ కె.ఎ్‌స.లక్ష్మణ్‌రావు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కు ఫిట్‌మెంట్‌ పెంచాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌ను బుధవారం గుంటూరులో కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. మరోవైపు మరో టీచర్‌ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి.. జగన్‌కు ఫిట్‌మెంట్‌పై లేఖ రాశారు. ‘‘10వ పీఆర్‌సీ కింద 29ు ఐఆర్‌, 43శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. కానీ 11వ పీఆర్‌సీలో ఐఆర్‌ 27శాతం, ఫిట్‌మెంట్‌ 23శాతమే ఇచ్చారు. ఇది ఉద్యోగుల అభిమతానికి విరుద్ధం’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. పీఆర్‌సీ నివేదికని బయటపెట్టకపోవడం ఇదే మొదటిసారి అన్నారు. మరోవైపు హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను యథాతథంగా 12, 14.5, 20, 30 శాతంగా ఉంచాలని ప్రగతిశీల రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లిసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఫిట్‌మెంట్‌ను పెంచాలని ఒంగోలులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం అత్యవసర సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

Post a Comment

0 Comments