GET MORE DETAILS

ఔషధగుణం కల"కచ్చిలి"చేప ధర కేవలం 55వేల రూపాయలు మాత్రమే...

 ఔషధగుణం కల"కచ్చిలి"చేప ధర కేవలం 55వేల రూపాయలు మాత్రమే...




తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి (Sankranti) ముందే వారికి పండగ వచ్చేసింది.

ఊహించిన విధంగా ఆనందాలు నిపించింది. ఇది కదా నిజమైన పండుగ అనుకునేలా చేసింది. సాధారణంగా మత్స్యకారులు (Fisherman) చాలామంది ప్రాణాలకు తెగించి వేట కొనసాగిస్తారు.. ఒక్కోసారి చేపలు చిక్కక దొరికిన వాటికి సరైన ధర పలుకకా పస్తులు ఉండే రోజులు కూడా ఉంటాయి. అయితే కొంతమందికి మాత్రం అప్పుడడప్పుడూ లక్ ఫేవర్ చేస్తుంటుంది. చాలా అరుదైన చేప (Fish)లు వారి వలకు చిక్కి భారీ ధర పలికేలా చేస్తాయి. ఇటీవల కాలంలో మత్స్యకారులకు పంట పండిస్తున్నాయి. ఇటీవల అధిక వర్షాలు కురవడంతో నదులు, కాలువలులో కూడా పలు రకాల చేపలు దొరుకుతున్నాయి.

అందులో కొన్ని అరుదైన చేపలు ఉంటాన్నాయి. పైగా ఇవి భారీ రేటు పలుకుతుండడంతో జాలర్లకు కాసుల వర్షం కురుస్తోంది.

గత కొన్ని రోజులుగా తూర్పు గోదావరి జిల్లా (East Godavari District)ల్లో ఇటీవల దొరికిన చేపలు లక్షలు పలికాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా (Sriakakulam District)లోనూ ఇలాంటి ఓ అరుదైన చేప లభించింది. సీహెచ్‌ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు (Tirupati Rao) అరుదైన చేప (Rare Fish) చిక్కింది. దీంతో అతడి పంట పండింది. నిత్యం వేటకు వెళ్లే అలవాటు ఉన్న తిరుపతి రావు ఎప్పటిలానే వేటకు వెళ్లాడు. పండుగ ముందు ఎక్కువ చేపలు తల వలకు చిక్కాలి అని కోరుకున్నాడు. ఆయన ఆశించినట్టు అద్భుతమే జరిగింది.

తిరుపతి రావు విసిరిన వలకు అనూహ్యంగా దాదాపు 15 కేజీలకుపైగా బరువు ఉండే వల బయటకు వచ్చిన తరువాత ఆ చేపను చూసిన మత్స్యాకారుడు ఆనందంతో గెంతులు వేశాడు.

ఊహించని చేప దొరికందని...

భారీగా డబ్బులు వస్తాయని ఆశించాడు. అతడు ఆశించినట్టే కచ్చిలి చేపకు భారీ ధర పలికింది.దీన్ని వేలం వేయగా వ్యాపారులు 55 వేల రూపాయలకు కొనుగోలు చేశారు. దీంతో తిరుపతిరావు ముందే తన ఇంటికి పండుగ వచ్చింది అంటున్నారు.

చాలా అరుదుగా లభించే ఈ కచ్చిలి చేపలో ఎక్కువ ఆరోగ్య పోషకాలు ఉంటాయి అంటున్నారు మత్స్యకారులు. ఎందుకంటే ఈ చేపల పొట్టలో ఉండే తెల్లటి నెట్టును వివిధ రకాల ఔషధాల తయారీకి ఉపయోగిస్తారంటున్నారు. అందకే అంత భారీ ధర పెట్టిన ఈ కచ్చిలి చేపను కొన్నారు వ్యాపారులు. సాధరణంగా ఇవి ఎక్కువగా గోదావరి జిల్లాల్లో లభిస్తుంటాయి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో చిక్కడంతో వారి ఆనందానికి హద్దేలేకుండా పోతోంది.

Post a Comment

0 Comments