GET MORE DETAILS

పాలు మరియు వెల్లుల్లి వేడి చేసి తాగితే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా...?

 పాలు మరియు వెల్లుల్లి వేడి చేసి తాగితే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా...?



వెల్లుల్లి, పాలు రెండింటిలోను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తాగితే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. ముందుగా పొయ్యి మీద ఒక గ్లాస్ పాలను పెట్టి కొంచెం వేడి అయ్యాక 3 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నిమిషాల పాటు మరిగించి గ్లాస్ లో పోసుకొని తాగాలి.

ఈ వెల్లుల్లి పాలను ప్రతి రోజు తాగితే ఈ చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారికి చాలా బాగా పనిచేస్తుంది. రక్త నాళ్ళల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. ఈ పాలు రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. డయబెటిస్ ఉన్నవారు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

శరీరంలో రోగనిరోదక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి పాలు తాగితే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వలన మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంపడతాయి. ప్లెట్లెట్స్ తగ్గిన వారికి ఇది వరంగా చెప్పుకోవచ్చు. జ్వరం కారణంగా పడిపోయిన ప్లేట్ లెట్స్ ను వేగంగా పెంచుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది. పాలిచ్చే తల్లులకు పాలు రాక ఇబ్బంది పడుతుంటే వెల్లుల్లి పాలు తాగితే పాలు పడతాయి.

Post a Comment

0 Comments