GET MORE DETAILS

మద్రాసు అనేపేరు ఎలా వచ్చింది ? ఈ పేరు చెన్నైగా ఎప్పుడు మారింది ?

 మద్రాసు అనేపేరు ఎలా వచ్చింది ? ఈ పేరు చెన్నైగా ఎప్పుడు మారింది ?



శ్రీకాళహస్తిని కేంద్రంగా పాలిస్తున్న దామెర్ల చెన్నమనాయుడి కొడుకులు దామెర్ల వెంకటనాయుడు, అంకనాయుడు. దామెర్ల వెంకటనాయుడు యోధుడు. అంకనాయుడు యోధుడేకాదు గొప్ప సాహితివేత్త.ఉషాపరిణయం అనే గ్రంథం వ్రాశాడు. 

ఇందులో ఒక చారిత్రాత్మక విషయాన్ని పొందుపరిచాడు, తన సవతితల్లి(పినతల్లి) కొడుకు తనకు  సోదరుడైన  అయ్యప్ప ఒక గ్రామాన్ని నిర్మించి తన తండ్రి పేరున చెన్నపట్నమని పేరును పెట్టాడు. 

ఈ ప్రాంతంలో మైలాపూర్‌లో వున్న పోర్చుగీసు వారికి పులికాట్ సరస్సు వద్దనున్న డచ్చివారికి నిరంతరంగా కలహాలు జరుగుతుంటే వాటిని నివారించటానికే అయ్యప్ప ఈ కోటను నిర్మించాడు.

కాని చంద్రగిరిని రాజధానిగా పాలిస్తున్న  విజయనగర చక్రవర్తి పెదవెంకటరాయల  అనుమతితో పైన పెర్కొన్న దామెర్ల వెంకటనాయకుడు బ్రిటిష్ ఈస్టిండియా రాయభారైన ఫ్రాన్సిస్ డే కు 1639 లో మదరాసు ప్రాంతంలో కోట కట్టుకోటానికి అనుమతి ఇవ్వడం జరిగింది. అక్కడ బ్రిటిష్ వారు 1640 మార్చి నెలలో కోట కట్టడం ప్రారంభించారు. అదే సెయింట్ జార్జి ఫోర్ట్. ఈ కోటే మదరాసు ప్రావిన్స్ కు రాజధాని. చెన్నపట్నం ప్రక్కగా బ్రిటిష్ వారు కోటకట్టారు, క్రమంగా సెయింట్ జార్జిఫోర్ట్, మైలాపూర్, చెన్నపట్నం ఇతర సమీప గ్రామాలు అభివృద్ధి చెంది మదరాసు మహనగరంగా మార్పు చెందింది.

బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సెయింట్ జార్జ్ ఫోర్ట్ నిర్మించే కాలానికి శ్రీరంగరాయలు విజయనగర ప్రభువు చ శ్రీరంగరాయలు చంద్రగిరి రాజధానిగా పాలిస్తున్నాడు.

మరొక చారిత్రికాంశవాదన ఏమంటే ఫ్రాన్సిస్ డే తూర్పున సముద్రతీరప్రాంతంలో విజయనగర రాజ నుండి కోటను కట్టుకోటానికి  అనుమతులు పొందకముందే అక్కడో మత్స్యకార గ్రామముందని దానికి ముదరాస్ అనే వ్యక్తిపేరు మీదుగా ముదరాస అనే పేరుందనే వాదనకూడా బలంగా వుంది.

మత్స్యకారులలో బెస్తలేకాకుండా ముదిరాజులు కూడా వున్నారు. ఈ ముదిరాజులకే ముత్తరాసి, ముతరాస, తెలుగోళ్ళు,  తెనుగోల్లు అనేపేర్లు కూడా వున్నాయి. వీరు ఒకపుడు తమిళనాడులో రాచరికం చేసినవారే. కాలక్రమంలో చేపలు పట్టుట వీరి వృత్తిగా మారింది.

ముత్తరాసులనే చేపలు పట్టేకులంవారున్న గ్రామం కాబట్టి దానినే ముదరాసిపాలెం అన్నారు. కోటకట్టుకోవటానికి అనువైన ప్రాంతం కనుకనే అయ్యప్ప ఈప్రాంతంలో లేదా ఈ పాలెనికే ఓ చిన్న దుర్గాన్ని  నిర్మించివుండవచ్చు. ఇదే ప్రాంతంలో బ్రిటన్ రాయభారి కోట కట్టుకోవడానికి అనుమతి పొందివుండవచ్చును. సెయింట్ జార్జిఫోర్ట్ నిర్మాణం తరువాత ముదరాసి ప్రాంతం సైనిక, వర్తకవాణిజ్య, సాహిత్యరంగాలలో అభివృద్ధి సాధించి 

" ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై

      నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

      నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై

      నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై "

అన్నచందంగా ఇప్పటికి ఓ గొప్ప నగరంగా తీర్చిదిద్దుకొంది

17 జాలై 1996లో అధికారపూర్వకంగా మద్రాసు నగరం చెన్నైగా / చెన్నపట్టణంగా రూపుదిద్దుకొంది.

Post a Comment

0 Comments