GET MORE DETAILS

వివిధ దీప ప్రమిదలు - ఫలితాలు

 వివిధ దీప ప్రమిదలు - ఫలితాలు



బంగారు ప్రమిద: గోధుమలపై ఉంచి చుట్టూ ఎరుపు రంగు పూలు అలంకరించి, ఆవు నెయ్యితో తూర్పు ముఖంగా వెలిగించాలి. ధనసమృద్ధి, విశష బుద్ధి చాతుర్యం లభిస్తుంది.

వెండి ప్రమిద: బియ్యంపై ఉంచి తెలుపు రంగు పూలతో అలంకరించి, ఆవునెయ్యితో తూర్పు ముఖంగా వెలిగిస్తే ధనసంపద వృద్ధి చెందుతుంది.

రాగి ప్రమిద: ఎర్రని కందిపప్పుపై ఉంచి ఎరుపు రంగు పూలతో అలంకరించి, నువ్వుల నూనెతో దక్షిణాభిముఖంగా వెలిగిస్తే మనోబలం కలుగుతుంది, అనిష్టనాశనం.

కంచు ప్రమిద: దీనిని శనగపప్పుపై పెట్టి చుట్టూ పసుపురంగు పూలతో అలంకరించి, ఉత్తరాభిముఖంగా నువ్వుల నూనెతో వెలిగిస్తే ధనానిని స్థిరత్వం ఉంటుంది.

మట్టిప్రమిద: ఆవు నెయ్యితో తులసి మొక్క వద్ద వెలిగించాలి. దుష్టశక్తుల నాశనం, పాపహరణం.

పిండి ప్రమిదః: పిండితో నలుచదరపు దీపం వెలిగిస్తే నాలుగువిధాలా లాభం కలుగుతుంది.

• అమావాస్య రాత్రి ఆవు నేతితో రావిచెట్టు కింద దీపం పెడితే పితృదేవతలు సంతోషిస్తారు.

• ఆవనూనెతో రావిచెట్టు క్రింద నలభై ఒక్క రోజులు దీపం వెలిగిస్తే కోరిక కోరిక నెరవేరుతుంది.

• నువ్వుల నూనెతో నలభై ఒక్కరోజులు దీపం వెలిగిస్తే సమస్త రోగాలు తొలగుతాయి.

• గురువారం నాడు అరటిచెట్టు దగ్గర ఆవునేతితో దీపం వెలిగిస్తే అవివాహితులకు శీఘ్రమే వివాహ ప్రాప్తి కలుగుతుంది..

Post a Comment

0 Comments