GET MORE DETAILS

నాలుగు మతాలకూ వెలుగుల పండుగే...

నాలుగు మతాలకూ వెలుగుల పండుగే...



దీపావళి ఒక్క హిందువులు చేసే పండగే అయినా ఆ రోజునే బౌద్ధులు, జైనులు, సిక్కులు ఆనందోత్సాహాలతో పండగను జరుపుకుంటారు. సందర్భం వేరైనా అవీ పండగలే, వాటిలోనూ దీపాలు వెలగించడం ఉండడం విశేషం. ఇక నేపాల్, శ్రీలంక, మయన్మార్, ట్రినిడాడ్ టొబాగో, గయానా, సురినామ్, సింగపూర్, మలేషియా, ఫిజీల్లో దీపావళి జరుపుకోవడం ఉంది. ఈ దేశాల్లో దీపావళి సెలవు దినం. ఆ పండగ అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

దీపావళి పండుగ హిందువుల పండుగలలో ప్రధా నమైన వాటిలో ఒకటి. దీపావళి జరుపుకునేందుకు వివిధ కారణాలను పేర్కొంటుంటారు. వాటిలో ఎక్కువగా ప్రచా రంలో ఉన్నది నరకాసురుణ్ని శ్రీకృష్ణుడు సంహరించడం వల్ల ఆనందోత్సాహాలతో ప్రజలు ఈ ఉత్సవాలు జరుపుకు న్నారని చెప్పేది. ఇక రాముడు రావణ వధానంతరం సపరి వారంగా అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవ్వడానికి గుర్తుగా ఈ ఉత్సవాలు జరుపుకుంటుంటారని మరి కొంద రు భావిస్తుంటారు. బెంగాల్లో లో అక్కడివారు ఆ రోజున కాళికా దేవి ఆరాధన, మహారాష్ట్రలో అక్కడి వారు గణేశ పూజలు వంటివి చేస్తుంటారు. మరికొన్ని చోట్ల విష్ణువును లక్ష్మీదేవి వివాహమాడిన రోజుగా పేర్కొంటారు. అందు వల్లనే ఆ రోజున లక్ష్మీపూజ చేసే ఆచారం వచ్చిందని అంటా రు. ఇక మార్వాడీ, గుజరాతీ వర్గాల వారు దీపావళి నాడు కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహిస్తుంటారు.

అయితే దీపావళి ఒక్క హిందువులు చేసే పండగే అయినా ఆ రోజునే బౌద్దులు, జైనులు, సిక్కులు ఆనందో త్సాహాలతో పండగను జరుపుకుంటారు. సందర్భం వేరైనా అవీ పండగలే, వాటిలోనూ దీపాలు వెలగించడం ఉండడం విశేషం. ఇక నేపాల్, శ్రీలంక, మయన్మార్, ట్రిని డాడ్ టొబాగో, గయానా, సురినామ్, సింగపూర్, మలేషి యా, ఫిజీల్లో దీపావళి జరుపుకోవడం ఉంది. ఈ దేశాల్లో దీపావళి సెలవు దినం. ఆ పండగ అంతర్జాతీయంగా పర్యా టకులను ఆకర్షిస్తోంది.

బౌద్ధుల పండగ

బౌద్ధులు ఈ పండగ చేసుకోవడానికి కారణం ఈ రోజునే మౌర్యవంశానికి చెందిన అశోకుడు అన్నిటిని త్యజించి శాంతి మార్గాన్ని అనుసరించాడు. కళింగ యుద్ధంలో తీవ్ర రక్తపాతానికి ఒడిగట్టిన అశోకుడు అక్కడి జననష్టాన్నిచూసి, ఒక్కసారిగా విరక్తి కలిగి అహింసా మార్గాన్ని పాటించాలని తలచి బౌద్ధమతాన్ని స్వీకరిం చారు. దానిని బౌద్ధులు 'అశోక విజయ దశమి'గా పరి గణిస్తారు.

ఆ రోజున వారు బుద్ధుని బోధనలను, చక్రవర్తి అశో కుని తలుచుకుని ప్రార్థనలు చేస్తారు. ఇది క్రీస్తు పూర్వం 265 ప్రాంతాల్లో జరిగి ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం.

నేపాల్లోని నెవారీ ప్రజలు దీపావళి, సింగపూర్ లోని బౌద్ధులు ఈ పండగ జరుపుకుంటారు. సింగపూర్ బౌద్ధ దేశమైనా అక్కడ దీపావళి నాడు అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రభుత్వం కూడా వాటిని నిర్వహిస్తుంది. దీపావళిని అక్కడ అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తారు.

జైన మతంలో...

జైన మతంలో కూడా మనం దీపావళిగా జరుపుకునే పండగ రోజుకు ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు వారు కూడా ఆ రోజు దీపాలను వెలిగించి పండగ జరుపుకుం టారు. మహావీరుడు శాశ్వతానంద స్థితి (మోక్షం) పొంద డం అమావాస్యనాడే జరిగిందని అంటారు. ఆయన ఆస్థితి నిపొందే ముందు నాటి రాత్రి చీకటిగా ఉండడంతో ఆయన నిర్వాణం పొందే సమయాన్ని వెలుగులతో నింపాలని అక్కడి రాజు తో సహా సామంతులు ప్రజలందరూ దీపాలు వెలిగించారని చెబుతారు. మహావీరుని నిర్వాణాన్నే చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణంగా భావి స్తారు. అప్పటి నుంచి దీపావళి అమా వాస్య రోజున వారు దీపాలు వెలగిం చడం చేస్తుంటారు.

సిక్కు మతంలో...

సక్కుల దీపావళి రోజునే బందీ ఛోర్ దినోత్సవాన్ని కూడా జరుపు కుంటారు. 1619లో ఈ రోజునే వారి మత గురువుల్లో ఒకరైన గురు హర్ గోవింద్ జీ అప్పటి మొఘల్ చక్రవర్తి జహంగీర్ చెర నుంచి విడుదల కాగలిగారు.

ఒకానొక సమయంలో మొఘలుల అరాచకా లకు వ్యతిరేకంగా హర్ గోవింద్ సింగ్ సైన్యాన్ని కూడగట్టి ఒక కోట కట్టి స్థానిక మొఘల్ సేనానులను నాలుగు యుద్ధాలలో ఓడించారు కూడా. దానితో జహంగీర్ ఆయ నను మాయోపాయంతో బంధించాలని భావించాడు. ఆయనను చర్చలకు పిలిపించాడు. ఆయనతో బాటు 52 మంది హిందూ రాజులు, గురువులు కూడా వచ్చారు. జహంగీర్ ఎటువంటి చర్చలు లేకుండా వారినందరినీ గ్వాలియర్ కోటలోని జైలులో పెట్టించాడు. ఈలోగా జహంగీర్ అస్వస్థతకు గురికావడంతో ఆయన సహ చరుల్లో కొందరు దానికి కారణం హర్ గోవింద్ సింగ్ వంటి గురువును బంధించడం కారణమై ఉంటుందని విడుదలకు ఆదేశించమని సూచిం చారు.

హర్ గోవింద్ ఒక్కరినీ విడుదల చేయ డానికి జహంగీర్ అంగీకరించారు. అందరినీ విడుదల చేస్తేనే తాను వెళతానని హర్గోవింద్ చెప్పాడు. దానితో ఆయన అంగీని ఎంత మంది పట్టుకుని వెళ్లగలిగితే వారందరినీ విడుదల చేస్తానని జహంగీర్ ప్రకటించాడు. ఆ విధంగా నలుగురైదు గురు కన్న ఎక్కువ మంది వెళ్ళ లేరని ఆయన ఉద్దేశం. అయితే హర్తోవింద్ ఆ ఒక్క రాత్రిలో తన అంగీకి 52 కుచ్చిళ్లు కుట్టించారు. ఆ విధంగా ఆయన అంగీకున్న 52 కుచ్చిళ్లను పట్టుకుని ఆయనతో ఉన్న అందరూ బయటకు నడిచారు. అది దీపావళి రోజు. గ్వాలియర్ నుంచి ఆయన నేరుగా అమృత్ సర్కు వచ్చారు. దానితో ఆయన తల్లితో సహా అమృత్సర్ ప్రజలు ఆనందోత్సాహాలతో స్వర్ణదేవాలయాన్ని దీపాలతో అలంకరించారు.

దానికి గుర్తుగా ఇప్పటికీ ఆ ఆచారం కొనసాగుతోంది. జైలు నుంచి విడుదలైన నాటి నుంచి గురు హర్ గోవింద్ జీని బందీ ఛోర్ అని పిలవడం మొద లెట్టారు. బందీ ఛోర్ అంటే విముక్తి కల్పిం చినవాడు అని అర్థం. బందీ అంటే ఖైదీ. ఛోర్ అంటే విడుదల. అంత మందికి విముక్తి కల్పించినందున ఆయనను సిక్కులు అలా పిలుస్తారు. దీపావళి, బందీ ఛోర్ దినోత్సవం ఈ రెండూ వేర్వేరు పండుగలు. అయితే రెండింటిలో దీపాలు వెలి గించడం, టపాసులు కాల్చడం చేస్తారు.

సిక్కులకు మరొకందుకు కూడా దీపావళి పవిత్ర దినమయింది.. 1737లో ఈ రోజునే సిక్కు మత పండి తుడు, వ్యూహ కర్త అయిన భాయి మాన్ సింగ్ జీ అమరు డయ్యారు.

ఖల్సా ప్రార్థనలు చేసే వారందరూ పన్నులు కట్టాలని మొఘలులు చేసిన శాసనాన్ని ధిక్కరించినందుకు ఆయనను లాహోర్ లో బహిరంగంగా శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ఖండిస్తూ చిత్రవధ చేసి చంపారు. చాలా ప్రాంతా ల్లో సిక్కులు దీపావళిని ఆయన అమరత్వం పొందిన దినంగా పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ రోజున ఆయనను గుర్తుకు తెచ్చుకుంటారు.

Post a Comment

0 Comments