దేశవ్యాప్తంగా టెలిఫోన్, మొబైల్ కనెక్షన్లు సంఖ్య 118.9 కోట్లకు చేరింది.
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశ టెలీ సాంద్రత 86.89%
గ్రామీణ ప్రాంతాల్లో 15 శాతం పెరుగుదల నమోదు
ఇయర్ ఎండింగ్ రివ్యూలో టెలికం విభాగం వెల్లడి
దేశంలో గత ఏడేండ్లుగా టెలిఫోన్, మొబైల్ కనెక్షన్లు భారీగా పెరిగాయి.
2014 మార్చిలో 75.23 శాతంగా ఉన్న టెలీ-డెన్సిటీ (సాంద్రత).. 2021 సెప్టెంబర్ నాటికి 86.89 శాతానికి పెరిగింది. అప్పట్లో దేశవ్యాప్తంగా 93 కోట్ల టెలిఫోన్ కనెక్షన్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 118.9 కోట్లకు చేరింది. ఇదే సమయంలో మొబైల్ కనెక్షన్లు 1,165.97 మిలియన్ల (116.59 కోట్ల)కు పెరిగాయి. పట్టణ ప్రాంతాల్లో టెలిఫోన్ కనెక్షన్లు 55 కోట్ల నుంచి 66 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో 38 కోట్ల నుంచి 53 కోట్లకు పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లో టెలీ డెన్సిటీ 44 శాతం నుంచి 59 శాతానికి పెరిగినట్టు ఇయర్ ఎండింగ్ రివ్యూలో టెలికం విభాగం వెల్లడించింది.
నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్‌లో 67వ ర్యాంక్ :
టెలిఫోన్, మొబైల్ కనెక్షన్ల పెరుగుదలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఇచ్చే నెట్‌వర్క్ రెడీనెస్ ఇండెక్స్(ఎన్‌ఆర్‌ఐ)లో భారత్ తన ర్యాంకును మెరగుపరచుకొన్నది. 2020 నాటికి 88 ర్యాంకులో నిలిచిన భారత్ ఇప్పుడు ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 67వ స్థానానికి చేరింది. మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్ (మధ్యాదాయ) దేశాల్లో 3వ స్థానం, ఆసియా ఫసిపిక్ దేశాల్లో 12వ స్థానంలో నిలిచింది. ఎన్‌ఆర్‌ఐలో భారత్ స్కోర్ ఏడాది వ్యవధిలో 41.57 నుంచి 49.74 శాతానికి పెంచుకొన్నట్టు డబ్ల్యూఈఎఫ్ వెల్లడించింది.
ముఖ్యాంశాలు :
2014 మార్చిలో 25.15 కోట్లు ఉన్న ఇంటర్‌నెట్ కనెక్షన్లు, 2021 సెప్టెంబర్ నాటికి 231 శాతం వృద్ధిచెంది 83.37 కోట్లకు పెరిగాయి.
బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 6.1 కోట్ల నుంచి 79 కోట్లకు (1200 శాతం) వృద్ధి చెందాయి.
1 జీబీ వైర్‌లెస్ డాటా సబ్‌స్క్రిప్షన్ ధర రూ.268.97 నుంచి రూ.9.8కి తగ్గింది.
నెలవారీ డాటా సగటు వినియోగం 61.66 ఎంబీ నుంచి 14 జీబీకి (22,605%) పెరిగింది.
మొబైల్ బేస్ ట్రాన్సివర్ స్టేషన్ (బీటీఎస్)ల సంఖ్య 8 లక్షల నుంచి 23 లక్షలకు చేరింది.
మొబైల్ టవర్లు 4 లక్షల నుంచి 6.6 లక్షలకు (65 శాతం) పెరిగాయి.
టెలికం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 150% వృద్ధి చెందాయి. 2014- 2021 మధ్య కాలంలో రూ.62,386 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద 1.8 లక్షల గ్రామపంచాయతీలను ఆప్టికల్ పైబర్ కేబుల్‌తో కనెక్ట్ చేశారు. వీటిలో 17 వేల పంచాయతీలు డిసెంబర్ 31 నాటికి తమ సేవలను ప్రారంభించనున్నాయి.
0 Comments