GET MORE DETAILS

బ్యాంకు పనివేళలు కుదింపు...?

బ్యాంకు పనివేళలు కుదింపు...?



కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు అన్ని బ్యాంకులు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బిసి)కి విజ్ఞప్తి చేశాయి. ప్రభుత్వ పథకాలు బ్యాంకుల ద్వారానే అమలు జరుగుతున్న నేపథ్యంలో ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి కూడా ఎల్ఎస్ బిసి అధికారులు తీసుకువెళ్లారు. ప్రధానంగా బ్యాంకు కార్యాలయాల్లో పనివేళలను కుదించేందుకు అన్ని బ్యాంకులు నిర్ణయించుకున్నాయి. అయితే ఇప్పటివరకు మధ్యాహ్నం రెండు గంటల వరకు నగదు లావాదేవీలు జరుగుతుండగా, దానిని 12 గంటలకే కుదించేందుకు ఆలోచన చేస్తున్నాయి. ఇదే సమయంలో బ్యాంకుల్లో ఉద్యోగులు కూడా 50 శాతం మందే పనిచేస్తూ, మిగిలిన 50 శాతం మంది ఇళ్ల నుంచే పనిచేసేలా చర్యలు తీసుకోవాలని దాదాపు నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. బ్యాంకు ఉద్యోగులను ఫ్రంట్ లైన్ వర్కర్గా గుర్తిస్తూ వారికి వాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వాలని బ్యాంకు అధికారులు సిఎసకు కోరారు.

Post a Comment

0 Comments