GET MORE DETAILS

కనుమనాడు ప్రయాణం

 కనుమనాడు ప్రయాణం



కనుమనాడు కాకి కూడా కదలదని సామెత. తెల్లవారి నిద్రలేస్తూనే ఆహారాన్ని అన్వేషించే అల్పజీవి కాకి. అటువంటి కాకికి కూడా కనుమనాడు తిండికి లోపం ఉండదు. కాబట్టి ఊరు వదిలి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. 

కాకికి పితృపక్షి అని పేరు. ఆబ్ధీక సమయంలో పితృ పిండాలను కాకి, గ్రద్ధలకు పెడతారు. లేదంటే నీటిలో విడిచిపెట్టి జలచరాలకు సమర్పిస్తారు. వాటిని సంతృప్తి పరిస్తే ఆ పుణ్యం పితృ దేవతలకు చేరుతుందని మన వారి నమ్మకం. 

కనుమ ప్రత్యేకించి పెద్దలకు పెట్టుకునే పండుగ. ఆ రోజున తప్పనిసరిగా పితృ దేవతలకు మన కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అంటే ఇంటి వద్ద తప్పనిసరిగా ఉండాలి.

అందుకే కనుమనాడు ప్రయాణం చేయవద్దన్నారు.

Post a Comment

0 Comments